Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: ఆ కంటెస్టెంట్ కి గుండు గీయమన్న బిగ్ బాస్... మూడేళ్ళ తర్వాత కీలక పరిణామం!


బిగ్ బాస్ హౌస్ అతిపెద్ద త్యాగానికి వేదికైంది. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న ఆర్టిస్ట్ జుట్టును కోల్పోవాల్సి వచ్చింది. ఈ సీజన్ కి హైలెట్ గా మారింది. 
 

bigg boss telugu 7 tough challenge to contestants ksr
Author
First Published Sep 21, 2023, 4:39 PM IST

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ కి అంత ఈజీ కాదనిపిస్తుంది. మొదట్లోనే బిగ్ బాస్ చుక్కలు చూపిస్తున్నాడు. కఠిన టాస్క్ లలో అల్లాడిస్తున్నాడు. ప్రస్తుతం మూడో కంటెండర్ పోస్ట్ కోసం పోటీ జరుగుతుంది. ఆట సందీప్ పవర్ అస్త్ర గెలిచి మొదటి కంటెండర్ అయ్యాడు. తర్వాత శివాజీ గెలిచాడు. సందీప్ కి 5 వారాల ఇమ్యూనిటీ దక్కింది.  శివాజీకి 4 వారాల ఇమ్యూనిటీ లభించింది. మూడో కంటెండర్ కి 3 వారాల ఇమ్యూనిటీ ఇస్తారు. దీని కోసం రేసులో ప్రిన్స్ యావర్, అమర్ దీప్ చౌదరి, శోభా శెట్టి ఉన్నారు. 

ప్రిన్స్ యావర్ కి ఒక టాస్క్ పెట్టగా గెలిచాడు. శోభా శెట్టికి కారంగా ఉన్న చికెన్ తినే టాస్క్ ఇచ్చాడు. కంటెండర్ అయ్యే అర్హత ఆమెకు లేదని చెప్పిన పల్లవి ప్రశాంత్, గౌతమ్, శుభశ్రీలకు కూడా ఒక టాస్క్ పెట్టాడు. తమ ముందున్న చికెన్ ఎవరు త్వరగా తింటే వారు శోభా శెట్టి స్థానంలో కంటెండర్ అయ్యేందుకు పోటీ పడవచ్చు అన్నాడు. ఇదిలా ఉంటే... అమర్ దీప్-ప్రియాంకకు భారీ ఫిట్టింగ్ పెట్టాడు. 

కంటెండర్ రేసులో ఉన్న అమర్ దీప్ కి ప్రియాంక ఒక్కటే వ్యతిరేకంగా ఓటు వేసింది. ప్రిన్స్ యావర్ కి మూడు వ్యతిరేక ఓట్లు, శోభా శెట్టికి మూడు వ్యతిరేక ఓట్లు పడ్డాయి. ప్రియాంక మాత్రం అమర్ దీప్ అనర్హుడని చెప్పింది. ఈ క్రమంలో వీరిద్దరికీ బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. ఇద్దరిలో ఎవరైతే తమ జుట్టును కత్తిరించుకుంటారో వారు కంటెండర్ రేసులో ఉంటారు అన్నాడు. దాంతో అమర్ దీప్, ప్రియాంక షాక్ అయ్యారు. 

అబ్బాయికైతే ఆల్మోస్ట్ గుండు చేయాలి. అమ్మాయికైతే భుజాలకు పైగా కత్తిరించుకోవాలి. తమ అందమైన జుట్టు వదులుకోవడానికి అమర్ దీప్, ప్రియాంక సంకోచించారు. చివరికి ఇద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరు జుట్టు త్యాగం చేయబోతున్నారో నేటి ఎపిసోడ్లో తెలుస్తుంది. సీజన్ 4లో పాల్గొన్న అలేఖ్య హారిక  మొదటిసారి జుట్టును కత్తిరించుకుంది. మూడేళ్ళ తర్వాత బిగ్ బాస్ జుట్టు తీసేసే దారుణమైన టాస్క్ బిగ్ బాస్ విధించాడు... 
 

Follow Us:
Download App:
  • android
  • ios