Bigg boss Telugu: ఆ కంటెస్టెంట్ ని ఇంటికి పంపేసిన నాగార్జున... షాకింగ్ ఎలిమినేషన్!
బిగ్ బాస్ తెలుగు 7లో సెకండ్ ఎలిమినేషన్ జరిగింది. నామినేషన్స్ లో ఉన్న 8 మందిలో ఆ టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 7 విజయవంతంగా రెండో వారం పూర్తి చేసుకుంది. ఇక ఆదివారం హోస్ట్ నాగార్జున రంగంలోకి దిగారు. సండే అంటే ఫన్ డే కాబట్టి నాగార్జున గేమ్స్ తో షో స్టార్ట్ చేశాడు. స్క్రీన్ పై కనిపించే కాస్ట్యూమ్ ఆధారంగా సినిమా పేరు గెస్ చేయాని అన్నాడు. ఈ గేమ్ లో ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించారు. ఈ గేమ్ లో మహాబలి టీమ్ నుండి పల్లవి ప్రశాంత్ వచ్చాడు, రణధీర టీమ్ నుండి ప్రియాంక వచ్చింది. మహాబలి టీమ్ దే పై చేయి అయ్యింది.
ఈ గేమ్ ముగిశాక నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నిలబడాలని నాగార్జున అన్నారు. నిన్న పవర్ అస్త్ర పొందిన శివాజీ సేవ్ అయ్యాడు. అలాగే అమర్ దీప్ కూడా సేవ్ అయ్యాడు. షకీలా, తేజా, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది.
బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ ప్రోమోలో నాగార్జున ఒకరు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు షకీలా అని విశ్వసనీయ సమాచారం. టేస్టీ తేజా, షకీలా డేంజర్ జోన్లో నిలిచారట. శోభా శెట్టికి కూడా తక్కువ ఓట్లే పడ్డట్లు వినికిడి. అయితే అందరికంటే తాజా, షకీలాకు తక్కువ ఓట్లు దక్కాయట. వీరిద్దరిలో షకీలా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారని సమాచారం.
ఇక ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. నెక్స్ట్ షకీలా ఇంటిని వీడనున్నారట. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయట. అంబటి అర్జున్, పూజా మూర్తి, ఫర్జానాతో పాటు పలువురు హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారట.