సోమవారం జరగాల్సిన నామిషన్స్ ప్రక్రియ మంగళవారం వరకూ కొనసాగింది. ఫస్ట్ వీక్ చెప్పుకోదగ్గ కారణాలు లేకున్నా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు.
ఫస్ట్ వీక్ నామిషన్స్ పై పెద్దగా క్లారిటీ ఉండదు. ఎదుకంటే హౌస్లోకి ఎంటర్ అయిన రోజు వ్యవధిలో తోటి కంటెస్టెంట్ ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఒక రోజులో ఒకరిని జడ్జి చేయడం కష్టం. అసలు పరిచయం లేని వ్యక్తులను మాతో కలవేలదని, అర్థం కాలేదని నామినేట్ చేయడం పిచ్చి వ్యవహారం. కొన్నాళ్ళు జర్నీ చేయకుండా ఒకరిని జడ్జి చేయలేం.
ఈ విషయంలో కంటెస్టెంట్స్ ని తప్పు బట్టడం పొరబాటు. వాళ్లపై షో నిర్వాహకుల ఒత్తిడి అలాంటిది మరి. గేమ్స్ రూల్స్ ప్రకారం తప్పదు మరి. ఒక్కరోజులోనే తోటి కకంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలి. హౌస్లో 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా వారిలో 8 మంది నామినేట్ అయ్యారు. కంటెస్టెంట్స్ అత్యధికంగా ఎలిమినేట్ కి నామినేట్ చేసిన వారు ఈ లిస్ట్ లో నిలిచారు. ఆ 8 మంది కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం... శోభా శెట్టి, రతిక, ప్రిన్స్ యావర్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, నటి కిరణ్ రాథోడ్ , నటుడు గౌతమ్ కృష్ణ, నటి షకీలా, సింగర్ దామిని. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు.
ప్రతి సీజన్ కి అత్యధికంగా 21 మంది అత్యల్పంగా 19 మంది కంటెస్టెంట్స్ ఉండేవారు. ఈ సీజన్ కి కేవలం 14 మంది హౌస్లోకి వెళ్లారు. ఇది అనూహ్య పరిమాణం. అయితే ఎప్పటి లాగే 20 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. వారు ఎలా హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు అనేది సస్పెన్సు. అబ్బాస్, ఫర్జానా, పూజా మూర్తి, జబర్దస్త్ నరేష్, మహేష్ ఆచంట, మొగలి రేకులు సాగర్ వంటి పేర్లు వినిపించాయి. వారు రానున్న వారాల్లో ఎంట్రీ అవకాశం కలదు.
