Asianet News TeluguAsianet News Telugu

BiggBoss7:బిగ్ బాస్ హౌస్ లో బిగ్ షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అతడే, ఆమె కోసమే బలి చేశారా..?

గత వారం బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించే సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం కూడా మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 

 

Bigg Boss Telugu 7 Sunday elimination update viral dtr
Author
First Published Nov 4, 2023, 4:19 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో బలమైన కంటెస్టెంట్స్ వెనుదిరగడం ప్రారంభం అయింది. ఆరంభంలో ఎక్కువగా లేడి కంటెస్టెంట్స్ వరుసగా ఎలిమినేట్ కావడం చూశాం. గత వారం నుంచి పురుషులు కూడా ఎలిమినేట్ అవుతున్నారు. గత వారం బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించే సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. 

బిగ్ బాస్ సీజన్ 7లో 9వ వారంలో అమర్ దీప్, శోభా శెట్టి, రతిక రోజ్, భోలే షావలి, ప్రియాంక జైన్, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, అర్జున్ నామినేట్ అయ్యారు. వీరిలో అమర్ దీప్, యావర్, అర్జున్, భోలే మంచి ఓటింగ్ తో సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక లాంటి వారు ప్రతి వారం ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. 

ఇక తేజ, శోభా శెట్టి ఇద్దరూ హౌస్ లో బలమైన కంటెస్టెంట్స్. తేజ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. శోభా శెట్టి ప్రతి టాస్క్ లో తన వాయిస్ వినిపిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ వీరి ఓటింగ్ మాత్రం చాలా పూర్ గా ఉందట. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ 7 నుంచి ఓ సమాచారం లీక్ అయింది. 

Bigg Boss Telugu 7 Sunday elimination update viral dtr

ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. శోభా శెట్టి కోసమే తేజని బలి చేస్తున్నారు అంటూ ఒక రూమర్ వైరల్ గా మారింది. ఎందుకంటే ప్రతి సారీ శోభా శెట్టి ఓటింగ్ పూర్ గానే ఉంటోంది. కానీ ఏదో ఒక గోల్ మాల్ చేసి ఆమెని సేఫ్ చేస్తున్నారు నయని పావని లాంటి వారిని బలిచేశారు. ఈ సారి కూడా శోభా శెట్టికి తేజ కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయా అనే అనుమానాలు ఉన్నాయి. 

గ్లామర్ పరంగా శోభా శెట్టిని రక్షిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా బిగ్ బాస్ 7 కాస్త ఊహించని సర్ప్రైజ్ లతో షాక్ ఇస్తూనే ఉంది. తేజ ఎలిమినేట్ అవుతున్న నేపథ్యంలో ఆదివారం రోజు హౌస్ లో ఎలాంటి వాతావరణం ఉంటుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios