Bigg Boss Telugu 7: సహజీవనం తర్వాతే పెళ్లి... హౌస్లో అవి చూపించలేదు!
బిగ్ బాస్ తెలుగు 7 పాల్గొన్న దామిని మూడో వారం ఎలిమినేటైంది. ఈ బాహుబలి సింగర్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ తెలుగు 7 నాలుగు వరాలు పూర్తి చేసుకుంది. మూడో వారం సింగర్ దామిని ఎలిమినేటైన విషయం తెలిసిందే. దామిని హౌస్లో ఉన్నన్నాళ్ళు చక్కగా అందరికీ వంట చేసి పెట్టింది. వంటలక్కగా పేరు తెచ్చుకుంది. అయితే గేమ్ పరంగా వెనుకబడిన నేపథ్యంలో ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేయలేదు. అదే సమయంలో హౌస్లో జరిగిన కొన్ని విషయాలు ప్రసారం చేయలేదు. దాంతో నేను చెడ్డగా ప్రొజెక్ట్ అయ్యానని ఆమె అన్నారు.
టాస్క్ లో భాగంగా ప్రిన్స్ యావర్ ముఖాన పేడ కొట్టినప్పుడు, తర్వాత అతనికి స్వయంగా తలస్నానం చేయించాను. సారీ కూడా చెప్పాను. ఇది ప్రసారం చేయలేదు. వినాయక ఫెస్టివల్ జరిగినప్పుడు అతడిని మెచ్చుకున్నాను. అయితే గొడవ పడిన విషయాలు మాత్రమే చూపించారు. ఆ కారణంగా నా మీద వ్యతిరేకత వచ్చిందని దామిని అన్నారు.
అనంతరం ఆమె వ్యక్తిగత విషయాలు వెల్లడించారు. నేను వెజిటేరియన్. గుడ్డు మాత్రం తింటాను. అయితే బిగ్ బాస్ హౌస్లో చికెన్ వండాను. బాహుబలి మూవీలో 'పచ్చ బొట్టేసిన' సాంగ్ పాడిన నేను ఇంత వరకూ టాటూ వేయించుకోలేదు. ఒంటిపై టాటూ ప్రత్యేక సందర్భంగా నచ్చిన ప్రదేశానికి వెళ్లి వేయించుకోవాలని నా కోరిక. నాకు ప్రేమ పెళ్లి అంటే ఇష్టం. అందుకే ఇంకా వివాహం చేసుకోలేదు.
కొన్నాళ్ళు సహజీవనం చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటాను. కుటుంబ సభ్యుల అనుమతితో సహజీవనం చేస్తానని దామిని చెప్పుకొచ్చింది. మరోవైపు నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే సందిగ్ధత కొనసాగుతుంది. ప్రియాంక, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, గౌతమ్, టేస్టీ తేజా, రతికా రోజ్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో తేజా, రతికా రోజ్ డేంజర్ జోన్లో ఉన్నారని సమాచారం.