Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: షాకింగ్ ఓటింగ్... డేంజర్ జోన్లో టాప్ కంటెస్టెంట్స్, ఇంటికి వెళ్ళేది ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు 7లో మూడో వారం నడుస్తుంది. 7 గురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా ఇద్దరు ఓటింగ్ లో వెనుకబడ్డారు. వారిలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయం అనిపిస్తుంది. 
 

bigg boss telugu 7 shocking voting this contestant to eliminate ksr
Author
First Published Sep 21, 2023, 2:47 PM IST

సెప్టెంబర్ 3న బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. అనూహ్యంగా 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్లో అడుపెట్టారు. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. సెకండ్ వీక్ షకీలా హౌస్ ని వీడారు. ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఆట సందీప్, శివాజీ పవర్ అస్త్ర గెలిచారు. కాబట్టి వాళ్ళు నామినేషన్స్ లో ఉండరు.

రతికా రోజ్, అమర్ దీప్, ప్రియాంక, శుభశ్రీ, గౌతమ్, దామిని, ప్రిన్స్ యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ ఏడుగురి ఓటింగ్ సరళి గమనిస్తే... ఈవారం లేడీ కంటెస్టెంట్ ఇంటికి వెళ్లిపోవచ్చనే సందేహం కలుగుతుంది. ఏడుగురిలో అమర్ దీప్ ఓటింగ్ లో ప్రధమ స్థానంలో ఉన్నారు. ఈ సీరియల్ నటుడికి దాదాపు 31 శాతం ఓట్లు పడ్డాయి. అమర్ దీప్ వెనుక 16 శాతం ఓట్లతో గౌతక్ కృష్ణ నిలిచాడు.

తన గేమ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న యావర్ పుంజుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. 15 శాతానికి పైగా ఓటింగ్ తో అతడు మూడో స్థానంలో ఉన్నట్లు సమాచారం. 11 శాతం ఓట్లతో శుభశ్రీ, 10 శాతం ఓట్లతో రతికా రోజ్ ఆ తర్వాత స్థానంలో ఉన్నారట. చివర్లో ప్రియాంక, దామిని నిలిచారు. ప్రియాంకకు కూడా 10 శాతం ఓట్లు పడ్డాయి. దామిని కేవలం 4 శాతం ఓట్లు పోలైనట్లు సమాచారం. 

కాబట్టి ఈ వారం సింగర్ దామిని తట్టాబుట్టా సర్దేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఓటింగ్ లో భారీ వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో దామిని ఈ రెండు రోజుల్లో పుంజుకునే అవకాశం లేదు. కాబట్టి దామిని ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే ఇవి ఊహాగానాలు మాత్రమే. ఓటింగ్ గురించి సోషల్ మీడియా చర్చ ఆధారంగా అంచనా వేయడమైంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios