Asianet News TeluguAsianet News Telugu

టేస్టీ తేజాకు షాకింగ్ రెమ్యునరేషన్... 9 వారాలకు  అన్ని లక్షలు ఇచ్చారా?

టేస్టీ తేజ ఎలిమిలేటైన విషయం తెలిసిందే. ఉత్కంఠ మధ్య తేజ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించాడు. తొమ్మిది వారాలు హౌస్లో ఉన్న తేజ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో చూద్దాం... 
 

Bigg Boss telugu 7 shocking remuneration to tasty teja for 9 weeks ksr
Author
First Published Nov 6, 2023, 7:29 AM IST | Last Updated Nov 6, 2023, 7:29 AM IST

గత వారం సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక 9వ వారానికి అమర్ దీప్, అర్జున్, రతిక, తేజ, భోలే, శోభ, యావర్, ప్రియాంక నామినేషన్స్ లో ఉన్నారు. ఆదివారం ఎంటర్టైనింగ్ గేమ్స్ ఆడిస్తూనే ఎలిమినేషన్ ప్రాసెస్ జరిపాడు నాగార్జున. ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారు. చివర్లో యావర్, రతిక, తేజ మిగిలారు. ఈ ముగ్గురిలో యావర్ సేవ్ అయ్యాడని నాగార్జున ప్రకటించారు. ఇక డేంజర్ జోన్లోకి వచ్చిన తేజ, రతికలను గార్డెన్ ఏరియాలోకి పిలిచాడు. 

ఎలిమినేట్ అయ్యేది తానే అని రతిక ఫిక్స్ అయ్యింది. కన్నీరు పెట్టుకుంటూ నాగార్జునను బ్రతిమిలాడుకుంది. నాకు ఒక్క వారం ఛాన్స్ ఇవ్వండి. ఎలిమినేట్ చేయొద్దని వేడుకుంది. నా చేతుల్లో ఏమీ లేదు. ఓటింగ్ ముగిసిందని నాగార్జున అన్నారు. ఎవరి పేరు బోర్డు పై కనిపిస్తుందో వారు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పారు. తేజ పేరు రావడంతో అతడు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. 

Bigg Boss telugu 7 shocking remuneration to tasty teja for 9 weeks ksr

తేజ తన ఎలిమినేషన్ ని స్పోర్టివ్ గా తీసుకున్నాడు. ఏడుపులు పెడబొబ్బలు కార్యక్రమం పెట్టలేదు. శోభ, ప్రియాంక బాగా ఫీల్ అయ్యారు. తేజ సోషల్ మీడియా సెలబ్రిటీ హోదాలో హౌస్లో అడుగుపెట్టాడు. మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు. అందరితో బాగానే ఉండే తేజ శోభకు బాగా దగ్గరయ్యాడు. శోభ కూడా ఎప్పుడూ అతనితో ఉండేందుకు ఇష్టపడుతుంది. హౌస్లో శివాజీ బ్యాచ్, సీరియల్ బ్యాచ్ అని రెండు ఉన్నాయి. తేజ కొంత మేరకు సీరియల్ బ్యాచ్ అనుకోవచ్చు. 

తేజకు పెద్దగా ఫేమ్ లేదు. అయినప్పటికీ 9 వారాలు రాణించాడంటే గొప్ప విషయం. తేజ ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతాడు. కామెడీ యాంగిల్, సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నాయి. ఇక టేస్టీ తేజ రెమ్యూనరేషన్ ఎంత అంటే... అతడు వారానికి రూ.1.5 లక్షల ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టాడట. తొమ్మిది వారాలకు గాను రూ. 13.5 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడట. ఇతర సెలెబ్స్ తో పోల్చుకుంటే ఇది తక్కువ రెమ్యూనరేషన్ అని చెప్పొచ్చు. 

Bigg Boss telugu 7 shocking remuneration to tasty teja for 9 weeks ksr

అయితే టేస్టీ తేజ అంత పాప్యులర్ కాదు. రెమ్యూనరేషన్ పక్కన పెడితే అతడికి భారీ ఇమేజ్ దక్కింది. బిగ్ బాస్ షో తేజ కెరీర్ కి ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. ఒక్క పల్లవి ప్రశాంత్ తప్పితే... తేజ నామినేట్ చేసిన ప్రతి ఒక్కరూ ఎలిమినేట్ అయ్యారు. హౌస్ ని వీడిన 7 మంది తేజ నామినేట్ చేసినవాళ్ళే. ఈసారి నేను వెళ్లిపోవచ్చని అతడు ముందుగానే గెస్ చేశాడు. అదే జరిగింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios