హౌస్లో తేజా-శోభా శెట్టి గిల్లికజ్జాలు.. వీరు ఫ్రెండ్సా? ప్రేమికులా? 


కంటెస్టెంట్స్ తేజా, శోభా శెట్టి హౌస్లో అడుగుపెట్టిన నాటి నుండి క్లోజ్ గా ఉంటున్నారు. వీరి మధ్య మంచి స్నేహం నడుస్తుంది. అయితే వీరి గిల్లికజ్జాలు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. 
 

bigg boss telugu 7 shobha shetty and teja relation raising speculations ksr

సింగిల్ గా వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు బిగ్ బాస్ హౌస్లో జంటలుగా మారడం కామన్. గత ఆరు సీజన్లో.... రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి, అఖిల్ సార్థక్-మోనాల్, అభిజీత్-అలేఖ్య హారిక, ఇనాయ-ఆర్జే సూర్య, షణ్ముఖ్-సిరి ఘాడమైన ప్రేమ కథలు నడిపారు. ఈ సీజన్లో ఇంకా ఎవరూ జంటలు కాలేదు. వరుసగా అమ్మాయిలను బిగ్ బాస్ ఇంటి నుండి పంపించేస్తుంటే జంటలు మారే సమయం రావడం లేదు. 

శుభశ్రీ-గౌతమ్ మధ్య రిలేషన్ డెవలప్ అవుతున్న సమయంలో ఆమె ఎలిమినేట్ అయ్యింది. అయితే తేజా-శోభా శెట్టి చాలా క్లోజ్ గా ఉంటున్నారు. అంత మాత్రాన వీరిని లవర్స్ అనలేము. వీరు సన్నిహితంగా ఉంటున్నారు కానీ రొమాంటిక్ యాంగిల్ లేదు. ఉన్నా దాన్ని కామెడీగా మార్చేస్తున్నారు. బిగ్ బాస్ శోభా పేరు టాటూగా వేయించుకోవాలని తేజాను ఎంత బలవంతం చేసినా అది చేయలేదు. 

ఒకరంటే ఒకరికి ఇష్టం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న నామినేషన్స్ లో భోలే-శోభా మధ్య వాగ్వాదం నడిచింది. నామినేషన్స్ ముగిశాక... తేజాతో తన ఆవేదన చెప్పుకుంటుంది. ఆమె మాట్లాడుతూ ఉండగానే తేజా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను మాట్లాడుతుంటే కనీసం రెస్పెక్ట్ లేకుండా వెళ్ళిపోతున్నావు... అని సర్రున అక్కడి నుండి వెళ్ళిపోయింది. 

తేజా ఆపే ప్రయత్నం చేసినా వినలేదు. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తావు నువ్వూ అంటూ తేజా అసహనం వ్యక్తం చేశాడు. ఇదంతా చూస్తుంటే... తేజా, శోభా మధ్య స్నేహానికి మించిన బంధం ఏదో బలపడినట్లుగా ఉంది. మరి చూడాలి వీరి స్నేహం ఎలాంటి మలుపు తిరుగుతుందో... 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios