Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: రతికా రోజ్ రీఎంట్రీ..? హౌస్లో యుద్దమేనా!

గత వారం సంచలన ఎలిమినేషన్ చోటు చేసుకుంది. టాప్ కంటెస్టెంట్ రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యింది. ఆమె రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కలదంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . 
 

bigg boss telugu 7 rathika rose to re enter to bigg boss house ksr
Author
First Published Oct 5, 2023, 3:57 PM IST | Last Updated Oct 5, 2023, 3:57 PM IST

బిగ్ బాస్ షోలో ఏదైనా జరగొచ్చు. ఆడియన్స్ ని థ్రిల్ చేసేందుకు మేకర్స్ అనేక ప్రయోగాలు చేస్తారు. అనూహ్యంగా ఈ సీజన్ కేవలం 14 మందితో మొదలైంది. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్ మొదటి వారం ఎలిమినేట్ కాగా షకీలా, దామిని తర్వాతి వారాల్లో ఇంటి బాటపట్టారు. గత వారం ఎలిమినేషన్ సంచలనం అని చెప్పాలి. ఫైనలిస్ట్ లో ఒకరిగా ప్రచారమైన రతికా రోజ్ హౌస్ ని వీడింది. 

ఆమెపై తీవ్ర నెగిటివిటీ నేపథ్యంలో ప్రేక్షకులు ఓట్లు వేయలేదు. రతికా రోజ్ ప్రవర్తన, పల్లవి ప్రశాంత్ తో వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది. అయితే సోషల్ మీడియాలో రతికా రోజ్ ఫ్యాన్స్ ఆమెకు ఓ ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అనుకోని కారణాలతో ఆమె గేమ్ తప్పుదోవ పట్టింది. కాబట్టి రతికా రోజ్ ని మరలా హౌస్లోకి ఆహ్వానించాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒకసారి ఎలిమినేటైన కంటెస్టెంట్ ని షోలోకి ఆహ్వానించడం జరగని పని. అసాధ్యం అయితే కాదు. గతంలో కొందరు బయటకు వచ్చి మళ్ళీ వెళ్లారు. 

సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజా 7వ వారం ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఆడియన్స్ డిమాండ్ మేరకు అతడికి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. దాంతో ఫైనల్ కి వెళ్లిన అలీ రెజా 4వ స్థానంలో నిలిచాడు. అలాగే సీజన్ 2లో నూతన నాయుడు అనే కంటెస్టెంట్ కాలికి గాయమైంది. బయట ట్రీట్మెంట్ తీసుకుని మరలా హౌస్లోకి వచ్చాడు. ఒక్కసారి హౌస్ నుండి బయటకు వస్తే కంటెస్టెంట్స్ లో ఎవరు టాప్ లో ఉన్నారు? ఆడియన్స్ ఫల్స్ ఏంటో తెలిసిపోతుంది. అందుకే ఒకసారి ఎలిమినేట్ అయిన వాళ్ళను అంత తేలిగ్గా హౌస్లోకి పంపరు. మరి రతికా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి... 

కాగా ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వెళ్లనున్నారట. ఇది మినీ లాంచింగ్ ఈవెంట్ లాంటిదే అంటున్నారు. అక్టోబర్ 8 ఆదివారం మరో లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ ద్వారా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ని ఇంట్లోకి పంపనున్నారట. గతంలో ఎన్నడూ చేయని ఈ ప్రయోగం ప్రేక్షకులకు కిక్ ఇవ్వనుందని అంటున్నారు. 

జబర్దస్త్ కెవ్వు కార్తీక్ అట. అలాగే సీరియల్ నటుడు అంబటి అర్జున్, సీరియల్ నటి పూజా మూర్తి, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షామిలి, సీరియల్ నటి అంజలి పవన్, సీరియల్ నటి నయని పావని అంటున్నారు. ఈ కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెడుతున్నారనేది తాజా సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios