హౌస్లోకి వెళ్లబోయే ముందు రతిక రోజ్ వీడియో... ఇకపై చూస్తారంటూ షాకింగ్ కామెంట్స్!
రతిక రోజ్ కి సెకండ్ ఛాన్స్ దక్కింది. ఆదివారం ఆమె హౌస్లో అడుగుపెట్టింది. నాగార్జున రెండోసారి ఆమెను బిగ్ బాస్ ఇంటికి పంపాడు. కాగా వెళ్లబోయే ముందు రతిక రోజ్ ఓ వీడియో చేసింది...

సోషల్ మీడియాలో ఎంత నెగిటివిటీ ఉన్నా... రతిక రోజ్ ని హౌస్లోకి పంపాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అందుకే హౌస్ మేట్స్ ని కన్ఫ్యూజ్ చేసి రతికకు సెకండ్ ఛాన్స్ వచ్చేలా చేశారు. దామిని, శుభశ్రీ, రతిక రోజ్ లలో ఎవరు రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారో, వారికి ఓటు వేయాలి. ఓట్ల ఆధారంగా ఒకరు హౌస్లోకి వస్తారని నాగార్జున చెప్పాడు. హౌస్ మేట్స్ ముగ్గురిలో తమకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓటు వేశారు. ఓటింగ్ ముగిశాక... ఎక్కువ కాదు తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకు ఛాన్స్ అని నాగార్జున షాక్ ఇచ్చాడు.
రతిక రోజ్ తన కన్నింగ్ గేమ్ తో ప్రేక్షకుల్లో విపరీతమైన నెగిటివిటీ తెచ్చుకుంది. ఆమెను ఎలిమినేట్ చేయాలంటూ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నాలుగో వారం రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యింది. ఆమె తిరిగి ఇంట్లోకి రావడంపై కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. రెండు వారాలు బయట ఉండి ఆడియన్స్ నుండి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందో గమనించిన రతిక ప్రేక్షకులను బుజ్జగించే కార్యక్రమం స్టార్ట్ చేసింది.
బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లబోయే కొన్ని నిమిషాల ముందు ఓ వీడియో చేసి తన ఇంస్టాగ్రామ్ లో పెట్టింది. గతంలో నేను కొన్ని తప్పులు చేశాను. అవన్నీ మరచిపోండి. ఇకపై నా గేమ్, మాట్లాడే పాయింట్స్ చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పటి నుండి నా ఆట చూడండి. నన్ను సపోర్ట్ చేయండి. ఫైనల్ కి వెళ్లేలా చేయండి.. అంటూ వేడుకుంది.
పల్లవి ప్రశాంత్ సింపతీ గేమ్ ఆడుతున్నాడు. రైతు బిడ్డ అని నెట్టుకొస్తున్నాడని విమర్శలు చేసిన రతిక రోజ్ ఇప్పుడు చేసేది ఏంటి?. ఇంట్లోకి వెళ్లడంతోనే ఎవరూ లేకుండా చూసి శివాజీ కాళ్ళ మీద పడింది. తప్పులు చేశాను క్షమించండని కన్నింగ్ గేమ్ స్టార్ట్ చేసింది. తన గేమ్ లో నిజాయితీ ఉంటే ఈ పని అందరి ముందు చేసేది. రతిక రోజ్ బట్టలపై విమర్శలు రాగా గ్లామర్ డోస్ తగ్గించింది. నిండైన బట్టలు వేసుకుంటూ... కుంకుమ బొట్టుతో కనిపిస్తుంది. ఒకటి అయితే నిజం రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఎంత గొప్పగా ఆడినా టైటిల్ గెలిచే ఛాన్స్ ఉండదు. ఫైనల్ కూడా కష్టమే..