Bigg Boss Telugu 7: రతిక రోజ్ ఎంట్రీ పూజ ఎగ్జిట్... వైల్డ్ కార్డు ఎంట్రీలపై వరుస వేట్లు!
బిగ్ బాస్ తెలుగు 7లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఒకరు ఎలిమినేట్ అవుతుండగా మరొకరు రీఎంట్రీ ఇస్తున్నారు.
గత సీజన్ ఫెయిల్యూర్ దృష్ట్యా సీజన్ 7పై బిగ్ బాస్ మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. షో ఫార్మాట్ మార్చేశారు. కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో షో స్టార్ట్ చేసి, 5 వారాల తర్వాత మరో 5 మంది కంటెస్టెంట్స్ ని హౌస్లో ప్రవేశ పెట్టారు. గతంలో ఎన్నడూ ఇంత మంది వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వచ్చింది లేదు. అంబటి అర్జున్, పూజ, నయని, అశ్విని, భోలే వైల్డ్ కార్డుతో హౌస్లో అడుగుపెట్టారు. వీరి నుండి నయని పావని గత వారం ఎలిమినేట్ అయ్యింది. నయని ఎలిమినేషన్ ఎలిమినేషన్ విమర్శలకు దారి తీసింది.
కాగా నేడు మరో కంటెస్టెంట్ ఇంట్లో అడుగుపెడుతుంది. అయితే ఆమె నయా కంటెస్టెంట్ కాదు. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్. దసరా పండగ నేపథ్యంలో స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్, డింపుల్ హయాతీ వంటి బోల్డ్ బ్యూటీస్ బిగ్ బాస్ వేదిక మీద ఆడిపాడనున్నారు. ఇదే వేదిక ద్వారా రతిక రోజ్ రీఎంట్రీ ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎలిమినేట్ అయిన దామిని, రతిక రోజ్, శుభశ్రీలలో నాగార్జున ఒకరికి ఛాన్స్ ఇచ్చారు.
హౌస్ మేట్స్ ఓటింగ్ ఆధారంగా రతిక రోజ్ కి ఛాన్స్ దక్కిందట. రతిక రోజ్ ఇంట్లోకి వస్తుంటే పూజ మూర్తి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఈ వారం నామినేషన్స్ లో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, గౌతమ్, తేజా, అశ్విని, భోలే, పూజ ఉన్నారు. తక్కువ ఓట్లు తెచ్చుకున్న పూజ ఎలిమినేట్ కానుందట. వరుసగా రెండో వైల్డ్ కార్డు ఇంటిని వీడటం ఊహించని పరిణామం. గత వారం ఎలిమినేట్ అయిన నయని పావని కూడా వైల్డ్ కార్డు ఎంట్రీనే.
పూజ మూర్తి మొదట్లోనే హౌస్లో అడుగుపెట్టాల్సింది. తండ్రి మరణంతో ఆమె వెనక్కి తగ్గారు. అయితే బిగ్ బాస్ షోకి వెళ్లడం తన తండ్రి కోరిక. ఆయన కల నెరవేర్చేందుకు షోకి వచ్చానని ఆమె అన్నారు. అనూహ్యంగా రెండు వారాల్లో ఆమె జర్నీ ముగిసింది. పూజ ఎలిమినేట్ అయితే అర్జున్, అశ్విని, భోలే వైల్డ్ కార్డు ఎంట్రీలు హౌస్లో మిగులుతారు. వీరిలో అర్జున్ ఒక్కడే చివరి వరకు ఉండే సూచనలు కలవు.