Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: శుభ శ్రీది గలీజ్‌ క్యారెక్టర్ అంటూ రతిక స్టేట్‌మెంట్‌.. కంట్రోల్‌ తప్పిన యావర్, గౌతం..

బిగ్‌ బాస్‌ షోలో మూడు వారాలు విజయవంతంగా ముగిసింది. నాల్గో వారం ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియ హౌజ్‌మేట్స్ మధ్య చిచ్చు పెట్టింది. గొడవ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. 
 

bigg boss telugu 7 promos subha shree rathika fire and yawar gautam goes for fighting arj
Author
First Published Sep 25, 2023, 8:23 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌.. మూడో వారంలో సింగర్‌ దామిని ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఇక నాల్గో వారం హౌజ్‌ ని వీడేందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దానికి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. సోమవారం ఎపిసోడ్‌ పూర్తిగా నామినేషన్ల ప్రక్రియ హాట్‌ హాట్‌గా సాగింది. హౌజ్‌ని వేడెక్కించింది. 

ఇందులో ప్రధానంగా శుభ శ్రీ, రతిక మధ్య వాదనలు పీక్‌కి వెళ్లాయి. అలాగే యావర్‌, గౌతం కృష్ణల మధ్య వాదనలు ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్లాయి. మరోవైపు యావర్‌ని తేజ ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. నేను ఇలానే ఉంటానంటూ ఫైర్ అయ్యారు. ఇక ప్రోమోల్లో.. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌కి సంబంధించి రతిక, శివాజీల మధ్య వాదన జరిగింది. రెండు చేతులు కలిపితేనే చప్పట్లు అనే విషయంలో శివాజీ ఇచ్చిన స్టేట్‌మెంట్ తనని చాలా బాధించిందని తెలిపింది రతిక. పదే పదే శివాజీని ఆ విషయంలో నిలదీసింది. 

అయితే తాను జస్ట్ కామెడీగా, సరదాగా ఆ విషయాన్ని చెప్పానని తెలిపారు. సారీ చెప్పనా, కాళ్లు పట్టుకోవాలా? అనే స్థాయికి శివాజీ వెళ్లడం, ఆ స్థాయిలో రతిక ప్రశ్నించడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేట్‌ చేయాలి, దాన్ని ఇతర ఇద్దరు అంగీకరించాలి. పవర్‌ అస్ర్త సాధించిన వాళ్లు నామినేషన్లకి మినహాయింపు. దీంతో శివాజీ, సందీప్‌, శోభా శెట్టి జడ్జ్ లు గా వ్యవహరించారు. 

ఇందులో రతిక విషయంలో శుభ శ్రీ.. నాగార్జున ముందు తన ఎక్స్ గుర్తొచ్చారని చెప్పిన విషయాన్ని తీస్తూ ఆమెని నామినేట్‌ చేసింది. అది కావాలని చెప్పినట్టుగా ఉందని శుభ శ్రీ అన్నది. దీనికి రతిక స్పందిస్తూ, తాను ఎక్కడో చెప్పిన విషయాన్ని తాను విని ఇక్కడ నామినేట్‌ చేయడం సరికాదని, అది నీ క్యారెక్టర్ ఏంటో తెలియజేస్తుందని మండిపడింది. దీంతో రెచ్చిపోయిన శుభ శ్రీ.. మాటలు అదుపులో పెట్టుకోమని వార్నింగ్‌ ఇచ్చింది. అయినా తగ్గని రతిక.. నీది గలీజ్‌ క్యారెక్టర్‌ అంటూ ఫైర్‌ అయ్యింది. 

శుభ శ్రీ నామినేట్‌ చేసిన వారిలో అమర్‌ దీప్‌ కూడా ఉన్నాడు. ఇంట్లో నేనేమీ పనులు చేయలేదా? అంటూ ప్రశ్నించాడు. నువ్వు మాత్రం కేవలం చపాతిలు మాత్రమే చేస్తావని, శుభ శ్రీ రోటీస్‌ అని బోర్డ్ పెట్టుకో అంటూ సెటైర్లు పేల్చాడు అమర్‌ దీప్‌. ఈ సందర్బంగా ఓ విషయాన్ని ఆయన వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. నన్ను బయటకు పంపించడం రాంగ్‌ పాయింట్‌ అని, మీరందరు వెళ్లిపోయినా నేనుంటా అని ఆయన స్టేట్‌మెంట్‌ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుంది. అందరిని షాక్‌కి గురి చేస్తుంది. 

అనంతరం చిచ్చు.. యావర్, గౌతంకృష్ణల మధ్య రేగింది. నువ్వు నా వద్దకు అరుచుకుంటూ వచ్చావని, తూ క్యారే అంటూ అరిచావని గౌతంకృష్ణ తెలిపారు. దీనికి ఇది నా క్యారెక్టర్‌ ఇలానే ఉంటా, నా క్యారెక్టర్‌, నా యాటిట్యూడ్‌, నా కోపం వల్ల ఎవరికైనా హాని కలిగించిందా? ఎవరినైనా హర్ట్ చేశానా? ఇది నా ఐడెంటిటీ అంటూ ఫైర్‌ అయ్యాడు యావర్‌. ఎదుటి వారిని హర్ట్ చేయడం ఐడెంటిటీనా అని గౌతం అనగా, ఇద్దరి మధ్య గొడవ పీక్‌కి వెళ్లింది. బోనులోనుంచి యావర్ గౌతమ్‌మీద మీదకు వచ్చాడు. ఒకానొక దశలో అది పీక్‌లోకి వెళ్లి కొట్టుకునే స్థితికి వెల్లడంతో హౌజ్‌ మొత్తం ఖంగుతిన్నది. జడ్జ్ లు హెచ్చరించడంతో కాస్త కూల్‌ అయ్యింది. 

యావర్‌ .. ప్రియాంక, తేజలను నామినేట్‌ చేశాడు. ఈ క్రమంలో శోభా, ప్రియాంక ఫెమినిజం ప్లే చేస్తూ గేమ్‌ ఆడుతున్నారంటూ నోరు జారాడు. దీంతో జడ్జ్ గా ఉన్న శోభా శెట్టి ఫైర్‌ అయ్యింది. ఆ విషయం తేలే వరకు తాను ఆర్గ్యూకి ఒప్పుకోనని తెలిపింది. అయితే తనని పవర్‌ అస్త్ర పోటీ నుంచి తొలగించడం విషయంలో యావర్‌ హర్ట్ అయినట్టు తెలిపారు. అనంతరం తేజ, యావర్ మధ్య రచ్చ జరిగింది. మొత్తానికి ఈ వారం నామినేషన్ల ప్రక్రియ చాలా హాట్‌ హాట్‌గా జరిగిందని ప్రోమోలను బట్టి తెలుస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios