Bigg Boss Telugu 7: ఇదే థూ అని నేనంటే నీ బతుకేం కావాలి... ప్రియాంకకు భోలే స్ట్రాంగ్ కౌంటర్!
బిగ్ బాస్ షోలో నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. మెజారిటీ ఇంటి సభ్యులు భోలే షావలిని టార్గెట్ చేశారు. ప్రియాంక, శోభా శెట్టిలతో భోలేకి తీవ్ర వాగ్వాదం అయ్యింది.

బిగ్ బాస్ తెలుగు 7 ఆసక్తికరంగా సాగుతుంది. 7వ వారం నామినేషన్స్ జరుగుతున్నాయి. సోమవారం మొదలైన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. సోమవారం పల్లవి ప్రశాంత్... సందీప్, తేజాలను చేశాడు. సందీప్... పల్లవి ప్రశాంత్, భోలేను చేశాడు. ప్రియాంక భోలే, అశ్వినీలను చేసింది. అర్జున్... అశ్వినీ, భోలేలను చేశాడు. ఇక తేజా... పూజా, ప్రశాంత్ లను చేశాడు. ఇక మంగళవారం జరిగిన ఎలిమినేషన్స్ లో శోభా, ప్రియాంక... కలిసి భోలే పై దాడికి దిగారు.
శోభా నామినేట్ చేస్తూ భోలే మీద ఫైర్ అయ్యింది. పక్కన ఆడపిల్ల ఉన్నప్పుడు కంట్రోల్ యువర్ టంగ్ అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఆడపిల్లతో ఎందుకు అని భోలే అనగా.. పూజా కూడా రంగంలోకి దిగింది. ఇద్దరూ కలిసి వాయించేశారు. మొన్నటి వరకు మంచిగా ఉన్నారని భోలా అన్నాడు. నువ్వు నటించవు మంచిగా అంటూ ప్రియాంక గట్టిగా అరిచింది. థూ అంటూ ఉమ్ము ఊచింది. అదే థూ నేను అంటే నీ బతుకు ఏమవుతుందని? భోలే అన్నాడు.
భోలే ప్రవర్తన వింతగా ఉన్నప్పటికీ ఆ రేంజ్ లో ప్రియాంక, శోభా శెట్టి ఫైర్ కావడం అతి అనిపించింది. ఒక కంటెస్టెంట్ ని ఆ స్థాయిలో విమర్శించాల్సిన అవసరం లేదు. ఇక ఈ వారం భోలే, అశ్విని ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటారని క్లారిటీ వచ్చింది. బహుశా వీరిలో ఒకరిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం కావచ్చు.
అశ్విని నామినేషన్స్ లో తడబడింది. ముందు అమర్ ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పి తర్వాత అభిప్రాయం మార్చుకుంది. అంటే ఆమెకు ఎవరిని నామినేట్ చేయాలో? ఎందుకు చేయాలో కూడా స్పష్టత లేదు. అశ్వినికి బదులు నయని పావనిని ఎలిమినేట్ చేసి తప్పుచేశారన్న భావన వ్యక్తం అవుతుంది.