Bigg Boss Telugu 7: దూరమైన నాన్న కోరిక తీర్చేందుకే హౌస్లోకి... పూజా మూర్తి ఎమోషనల్ కామెంట్స్
బిగ్ బాస్ సీజన్ 7 సెకండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతుండగా వైల్డ్ కార్డు ఎంట్రీలు చోటు చేసుకుంటున్నాయి. సీరియల్ నటి పూజా మూర్తి కంటెస్టెంట్ అంటూ నాగార్జున పరిచయం చేశారు.

ఉల్టా ఫల్టా అంటూ హోస్ట్ నాగార్జున ఊహించని ట్విస్ట్స్ ఇస్తున్నాడు. డబుల్ ఎలిమినేషన్ పేరుతో శుభశ్రీ, గౌతమ్ కృష్ణలకు షాక్ ఇచ్చాడు. అయితే గౌతమ్ కృష్ణకు సెకండ్ ఛాన్స్ ఇచ్చి సీక్రెట్ రూమ్ కి పంపాడు. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీలు షురూ చేశారు. సెకండ్ లాంచ్ ఈవెంట్ లో మొదటిగా నటుడు అంబటి అర్జున్ హౌస్లో అడుగు పెట్టాడు. అనంతరం నటి అశ్విని, భోలే షావలి వరుసగా కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లారు.
అనంతరం సీరియల్ నటి పూజా మూర్తిని నాగార్జున పరిచయం చేశాడు. పూజా మూర్తి ఇంట్రో వీడియో ఆకట్టుకుంది. చూడటానికి బొద్దుగా ఉండే పూజాను చాలా మంది అవమానకరంగా మాట్లాడారని, అయితే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాను అన్నారు. ఇక వేదికపైకి వచ్చిన పూజా మూర్తి ఎమోషనల్ అయ్యారు. ఇది నాన్న కోరిక. నెక్స్ట్ నేను బిగ్ బాస్ షోకి వెళతాను అనగా నాన్న మరణ వార్త తెలిసింది. కొంత సేపటి క్రితమే నాన్న నాతో మాట్లాడారు. డోంట్ వర్రీ... నువ్వు షోకి వెళ్ళు. బాగా ఆడు. నేను చూస్తూ ఉంటాను. అని ధైర్యం చెప్పాడు. నాన్న దూరమైన బాధ నుండి ఇంకా కోలుకోలేదని చెప్పింది.
పూజా ఎమోషనల్ వర్డ్స్ మనసులు కదిలించాయి. ఇక హౌస్లో దమ్ముగా ఆడుతుంది ఎవరు? దుమ్ముగా ఆడుతుంది ఎవరు? అని అడిగారు. దమ్ముగా ఆడుతుంది శివాజీ, దుమ్ముగా ఆడుతుంది తేజా అని చెప్పింది. నాగార్జున ఆమెకు సర్ప్రైజ్ ఇస్తూ... పుదీనా చికెన్ తెప్పించాడు. మా నాన్నగారు వంట చాలా బాగా చేస్తారు. ఆయన చేసే పుదీనా చికెన్, రసం అంటే నాకు చాలా ఇష్టమని చెప్పింది. అనంతరం ఆమె హౌస్లోకి వెళ్ళింది.