Bigg Boss Telugu 7: ఓటింగ్లో దూసుకుపోతున్న రైతుబిడ్డ... డేంజర్ జోన్లో ఆ ఇద్దరు!
ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు సభ్యులు ఉండగా... ఓటింగ్ లెక్కలు బయటకు వచ్చాయి. కాగా పల్లవి ప్రశాంత్ సత్తా చాటుతున్నట్లు సమాచారం.

బిగ్ బాస్ తెలుగు 7 నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం ముగిసింది. మెజారిటీ సభ్యులు అశ్వినీ, భోలే షావలిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. వాదనల మధ్య నామినేషన్స్ పూర్తి అయ్యాయి. అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, తేజా, పల్లవి ప్రశాంత్, పూజా, అశ్విని, భోలే నామినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలియజేశాడు. రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఏడుగురిలో ఎవరు టాప్ లో ఉన్నారు. ఎవరు లీస్ట్ లో ఉన్నారని గమనిస్తే...
అందుతున్న సమాచారం ప్రకారం రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సత్తా చాటుతున్నాడు. కొన్ని విషయాల్లో పల్లవి ప్రశాంత్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతని మీద సోషల్ మీడియా ట్రోల్స్ కూడా అవుతున్నాయి. అయితే ప్రేక్షకుల్లో అతనికి ఉన్న ఆదరణ ఇవేమీ తగ్గించలేకపోతున్నాయని ఓటింగ్ చూస్తే అర్థం అవుతుంది. ఏకంగా 42 శాతానికి పైగా ఓట్లు పల్లవి ప్రశాంత్ కి పోల్ అయ్యాయని సమాచారం.
పల్లవి ప్రశాంత్ తర్వాత అమర్ దీప్ ఉన్నాడు. అతడికి దాదాపు 19 శాతం ఓట్లు వచ్చాయట. అనూహ్యంగా మూడో స్థానంలో భోలే షావలి కొనసాగుతున్నాడట. అతడికి 12 శాతానికి పైగా ఓట్లు వచ్చాయట. హౌస్ మొత్తం అతను అర్హుడు కాదని తేల్చిన నేపథ్యంలో బహుశా జనాలలో సింపథీ పెరిగి ఉండే అవకాశం కలదు. గౌతమ్ కృష్ణ, తేజా 9,8 శాతం ఓట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారట.
లీస్ట్ లో మరోసారి లేడీ కంటెస్టెంట్స్ ఉన్నట్లు సమాచారం. అశ్విని ఆరో స్థానంలో ఉండగా పూజా మూర్తి కేవలం 2 శాతం ఓట్లతో ఏడో స్థానంలో ఉందట. అశ్వినికి 5 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట. మరి ఇదే సరళి శుక్రవారం వరకు కొనసాగితే పూజా మూర్తి ఇంటి నుండి వెళ్ళిపోనుంది. గత ఆరు వారాల్లో అందరూ అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. వీరిలో శుభశ్రీ, రతికా రోజ్, దామినిలలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.