Bigg Boss Telugu 7: నామినేషన్స్ డే... కొత్త కంటెస్టెంట్ అశ్విని మీద శోభా శెట్టి ఫైర్!
సోమవారం నామినేషన్స్ డే రసవత్తరంగా సాగింది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ తో పాత వాళ్లకు యుద్ధం మొదలైంది.
నామినేషన్స్ డే వచ్చిదంటే హౌస్ వాడి వేడిగా మారిపోతుంది. ఆరో వారానికి నామినేషన్స్ ప్రక్రియ బిగ్ బాస్ మొదలుపెట్టాడు. దీనిలో భాగంగా ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది. నామినేట్ చేయాలనుకున్న హౌస్ మేట్ ముఖం మీద క్రాస్ మార్క్ వేయాలి. మొదటగా తేజస్విని వచ్చింది. అమర్ దీప్ ని నామినేట్ చేసింది.ఇందుకు కారణాలు చెప్పింది. అమర్ దీప్ కూడా తన వివరణ ఇచ్చాడు.
అనంతరం శోభా శెట్టిని నామినేట్ చేసింది. శోభా శెట్టి నామినేట్ చేయడానికి కారణం ఆమె గ్రూపులు కడుతుంది. కొందరితో మాత్రమే ఉంటుందని అశ్విని చెప్పింది. నేను ఈ గ్రూప్ తో తిరుగుతున్నాను. దాని వలన ఎవరి నష్టం వచ్చిందో చెప్పాలని శోభా శెట్టి పట్టుబట్టింది. అయితే నేను అమర్ దీప్ ని మాత్రమే నామినేట్ చేయాలని అనుకున్నాను. కానీ ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పడంతో నిన్ను నామినేట్ చేశానని అశ్విని లూజ్ కామెంట్ చేసింది.
దాంతో శోభా శెట్టి రెచ్చిపోయింది. అలా ఎలా నామినేట్ చేస్తామంటూ ఫైర్ అయ్యింది. అనంతరం కొత్త వాళ్ళను కూడా నామినేట్ చేసే ఛాన్స్ పాతవాళ్లకు ఇచ్చారు. శోభా శెట్టి తిరిగి అశ్వినిని నామినేట్ చేసింది. ఇక నామినేషన్స్ ప్రక్రియ అత్యధికంగా అమర్ దీప్ ని 7గురు నామినేట్ చేశారు. ఇక నామినేషన్స్ లో ఎవరు ఉన్నది... బిగ్ బాస్ వివరించాల్సి ఉంది.
గత ఐదు వారాల్లో ఐదుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం శుభశ్రీ ఇంటిని వీడింది. శుభశ్రీ ఎలిమినేట్ అయినందుకు బాధపడలేదు. హ్యాపీగా గుడ్ బై చెప్పింది. బిగ్ బాస్ హౌస్లో తన జర్నీని ఎంజాయ్ చేసింది. ఇక గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ కి వెళ్లిన విషయం తెలిసిందే. అతడు నామినేషన్ డే రోజు ఇంట్లోకి వచ్చాడు. వస్తూ వస్తూనే తనను ఇంటి నుండి పంపాలని అనుకున్న వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు.