Bigg Boss Telugu 7: నామినేషన్స్ డే హీటెక్కిన బిగ్ బాస్ హౌస్.... కంటెస్టెంట్స్ మధ్య వాడివేడి యుద్ధం!
సోమవారం వచ్చిదంటే బిగ్ బాస్ హౌస్ హీటెక్కుతోంది. కంటెస్టెంట్స్ నామినేషన్స్ ప్రక్రియలో రెచ్చిపోతారు. ఎమోషన్స్ హద్దులు దాటేస్తాయి.

బిగ్ బాస్ తెలుగు 7 (Bigg Boss Telugu 7)రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇద్దరు కంటెస్టెంట్స్ ఇంటిని వీడారు. మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు. రెండో వారం 9 మంది నామినేట్ కాగా శివాజీ పవర్ అస్త్ర గెలిచిన కారణంగా ఎలిమినేషన్ నుండి తప్పుకున్నాడు. అమర్ దీప్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ వరుసగా సేఫ్ అయ్యారు. చివర్లో తేజా, షకీలా మిగిలారు. వీరిద్దరినీ యాక్టివిటీ రూమ్ కి పిలిచిన నాగార్జున ఇద్దరిలో ఎవరి ఫోటో వస్తే వాళ్ళు సేఫ్ అన్నాడు.
తేజా ఫోటో రాగా అతడు సేవ్ అయ్యాడు. షకీలా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. షకీలా బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం హౌస్లో 12 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరిని నామినేట్ చేయడానికి వీల్లేదు. పవర్ అస్త్ర గెలిచిన శివాజీ 4 వారాలు, సందీప్ 5 వారాల ఇమ్యూనిటీ పొందారు. మిగిలిన 10 మంది సభ్యులు ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంది.
నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ పేరు, కారణాలు చెప్పి ముఖం మీద ఫోమ్ స్ప్రే చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ నామినేషన్స్ ప్రక్రియలో దామిని-ప్రిన్స్ యావర్ మధ్య వాగ్వాదం నడిచింది. అలాగే రతికా రోజ్-గౌతమ్ కృష్ణ కూడా వాదించుకున్నారు. అమర్ దీప్ శుభశ్రీని నామినేట్ చేశాడు. ఆమె హాల్ శుభ్రం చేయడం లేదని కంప్లైంట్ చేశాడు. పల్లవి ప్రశాంత్ తేజాను నామినేట్ చేయగా... తేజా కూడా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు. వీరిద్దరి మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది .
బిగ్ బాస్ సీజన్ 7 లేటెస్ట్ ప్రోమోస్ ఈ ఆసక్తిర విషయాలతో కూడుకొని ఉంది. ఇక ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? మూడో వారం ఎవరు నామినేషన్స్ లో ఉన్నారనేది పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు...