Asianet News TeluguAsianet News Telugu

అరిస్తే తప్పు ఒప్పైపోదు, సందీప్ కి శివాజీ కౌంటర్... నువ్వు సేఫ్ ప్లేయర్ అన్న యావర్!

బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ డే వేళ వాడివేడి వాదనలు చోటు చేసుకున్నాయి. పాయింట్స్ మాట్లాడుకునే క్రమంలో ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు.

bigg boss telugu 7 nominations day contestants looses temper ksr
Author
First Published Oct 24, 2023, 12:39 PM IST

నామినేషన్స్ డే వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్ సీరియస్ గా మారిపోతుంది. వారం రోజులుగా మనస్సులో దాచుకున్న అసహనం మొత్తం బయటపెట్టేస్తారు హౌస్ మేట్స్. సోమవారం ఎపిసోడ్లో నామినేషన్ ప్రక్రియ కొంత వరకు జరిగింది. శివాజీ... శోభా, ప్రియాంకలను నామినేట్ చేశాడు. అశ్విని కూడా ఈ సీరియల్ బ్యాచ్ నే నామినేట్ చేసింది. గౌతమ్... భోలే, శివాజీలను చేశాడు. ప్రియాంక... భోలే, అశ్వినిలను నామినేట్ చేసింది. 

సందీప్... ప్రశాంత్, భోలే, శోభా శెట్టి... యావర్, శివాజీ, భోలే... శోభా శెట్టి, గౌతమ్ లను చేశాడు. నేటి ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రాసెస్ వాడివేడిగా సాగినట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. యావర్... సందీప్ ని నామినేట్ చేశాడు. నువ్వు సేఫ్ ప్లేయర్ అని అన్నాడు. ఈ ఇంట్లో నీకంటే సేఫ్ ప్లేయర్ ఎవరూ లేరని సందీప్ ఎదురు చెప్పాడు. నేను మొదటి వారం నుండి నామినేషన్స్ లో ఉన్నా... నువ్వు లేవు. అందుకే సేఫ్ ప్లేయర్ ని యావర్ అన్నాడు. 

యావర్ అలాగే శోభా శెట్టిని నామినేట్ చేశాడు. అమర్... శివాజీ, భోలేలను నామినేట్ చేశాడు. భోలే, అమర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే సందీప్ తో శివాజీ, భోలేకి కూడా వాదన చోటు చేసుకుంది. నువ్వు గట్టిగా మాట్లాడితే తప్పు ఒప్పు అయిపోదు అని సందీప్ కి శివాజీ కౌంటర్ వేశాడు. ఇక ఈ వారానికి ఎవరెవరు నామినేట్ అయ్యోరో సాయంత్రం తెలుస్తుంది... 
 

Follow Us:
Download App:
  • android
  • ios