Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu7: వైరల్ అవుతున్న నాగార్జున బిగ్ బాస్ వీకెండ్ షర్ట్, రేటు ఎంతో తెలుసా..?

ఈమధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీలు వాడే వస్తువులు, వేసుకునే బట్టలు, వాడుకునే కార్లు.. అన్నీ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఉంటే వైరల్ ఎందుకు అవుతాయి..అందులో ఏదో స్పెషల్ ఉంటేనే కదా.. హార్ట్ టాపిక్ అయ్యేది. తాజాగా నాగార్జున వేసుకున్న షర్ట్.. దాని కాస్ట్ వైరల్ అవుతుంది. 
 

Bigg Boss Telugu 7 Nagarjuna Weekend episode Shirt Cost Viral JMS
Author
First Published Nov 29, 2023, 8:43 PM IST

ఈమధ్య సోషల్ మీడియా జనాలకు ఒకటే పని. ఫిల్మ్ స్టార్ సెలబ్రిటీలు ఏం వాడుతున్నారు. ఎలాంటి బట్టలు వేస్తున్నారు. ఏ కార్లు వాడుతున్నారు. వాటి కాస్ట్ ఎంత అనేది ఎప్పటికప్పుడు సెర్చ్ చేస్తూ.. అప్డ్ డేట్ చేస్తుంటారు. చిన్న చిన్న వస్తువలకు భారీ రేట్లు పెడితే..వెంటనే వాటిని వైరల్ చేయడమే కొంత మంది పని అయ్యింది. తాజాగా నాగార్జున షర్ట్ అలానే వైరల్ అవుతుంది. 

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నడుస్తోంది. ఈసీజన్ రసవత్తరగా నడుస్తుండగా.. వీకెండ్ లోనాగార్జున అదరిపోయే లుక్స్ లో కనిపిస్తూ.. మురిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఖరీదైన బట్టలు వేసుకుంటూ సందడి చేస్తుంటాడు. తాజా వీకెండ్ లో నాగార్జున కలర్ ఫుల్ షర్ట్ లో సందడి చేశాడు. గత వీకెండ్ నాగార్జున  నారింజ మిఠాయి రంగులో ఉన్న షర్ట్ ని వేసుకొచ్చాడు. ఈ షర్ట్ వేలెంటినో అనే అమెరికన్ బ్రాండ్ కి సంబంధించినది. 

అంతే కాదు ఈ అమెరికల్ షర్ట్ ధర దాదాపు 1132 యూరోలు ఉంటుందట. అంటే ఇండియన్ కరెన్సీ లో దీని కాస్ట్  1,03,395 రూపాయిలు. ఒక్క షర్ట్ ఇంత కాస్టా.. ఒక సామాన్యుడు ఏడాది  మొత్త తినడానికి సరిపోయే డబ్బులతో.. ఒక్క షర్ట్ కొనడం అంటే.. అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా  ఇప్పుడు మర్ ట్విస్ట్ ఏంటంటే..? ఇది 7 వేలు ఆఫర్లు ఉందట. ఆఫర్ లేకుంటే దాని అసలు కాస్ట్  1,10,000 రూపాయిలు.. ఇది కొసమెరుపు. 

Bigg Boss Telugu 7 Nagarjuna Weekend episode Shirt Cost Viral JMS

ఇక ఇప్పుడు నాగ్ షర్ట్ కాస్ట్ వైరల్ అవుతుంది. అటు బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఇంకా కొంత కాలం మాత్రమే ఉంది. లాస్ట్ వీకెండ్ లో ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా.. ఇంకా హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. గేమ్స్ రసవత్తరంగా సాగుతుండగా.. ప్రస్తుతం టికెట్ టూ ఫినాలే టాస్క్ లు నడుస్తున్నాయి. 

ఇక కింగ్ నాగార్జున  సినిమాల విషయానికి వస్తే... ఆయన ప్రస్తుతం నా సామి రంగా అనే సినిమాలో నటిస్తున్నాడు.  ఆ సినిమాలో ఆయన స్టైల్స్, లుక్స్ ప్రస్తుతం మనం వీకెండ్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో చూస్తున్నవే. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ.. ఫిట్నెస్ ను కాపాడుకుంటూ.. దూసుకుపోతున్నాడు కింగ్ నాగార్జున. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios