Bigg Boss Telugu 7: బెల్టు తీసుకొచ్చిన నాగార్జున ఓ రేంజ్ లో ఫైర్... ఆ కంటెస్టెంట్ కి శిక్షగా ఎలిమినేషన్?
బిగ్ బాస్ తెలుగు 7 మరో వీకెండ్ కి ఎంటర్ అయ్యింది. కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. అయితే వస్తూ వస్తూనే ఆయన క్లాస్ పీకాడు.

నేడు శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఆయన రావడమే కొందరిపై ఫైర్ అయ్యాడు. సంచాలక్స్ తో పాటు ఓ కంటెస్టెంట్ ని ఏకిపారేశారు. హౌస్లో నాలుగో కంటెండర్ కోసం ఈ వారం పోటీ జరిగింది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య ఓ ఫిజికల్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో గౌతమ్ పట్ల టేస్టీ తేజా విపరీతంగా ప్రవర్తించాడు. సున్నితమైన మెడకు గాయం అయ్యేలా బెల్టుతో గౌతమ్ మీద దాడి చేశాడు.
ఈ విషయాన్ని నాగార్జున సీరియస్ గా తీసుకున్నాడు. ముందుగా సంచాలకులుగా ఉన్న శివాజీ, సందీప్ లను ఏకిపారేశారు. తేజా అలా ప్రవర్తిస్తుంటే ఆపాల్సిన అవసరం ఉందా లేదా? అసలు మీకు కళ్ళు లేవా అని మండిపడ్డాడు. అనంతరం తేజాను ఎందుకు అలా చేశావ్ అని అడిగాడు. ఆ సమయంలో నాకు తెలియలేదు సర్ అని తేజా సమాధానం చెప్పాడు. బయట నుండి ఆడవాళ్లు కేకలు వేస్తున్నారు. నీకు అర్థం కాలేదా అని నాగార్జున తేజాను అడిగారు.
దీనికి శిక్ష ఏమిటని నాగార్జున కంటెస్టెంట్స్ ని అడిగారు. కొందరు జైలుకి పంపాలని అన్నారు. సందీప్ అయితే నేరుగా ఇంటి నుండి పంపేయడమే అన్నాడు. మరి నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం కలదంటున్నారు. రతికా రోజ్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, గౌతమ్, శుభశ్రీ, తేజా నామినేట్ అయ్యారు. వీరిలో అతి తక్కువ ఓట్లు రతికా రోజ్, తేజాలకు వచ్చాయని సమాచారం.
అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని అంటున్నారు. దాదాపు 4 నుండి 6 కొత్త కంటెస్టెంట్స్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కలదట. వీరిలో ఎక్కువగా సీరియల్ నటులు ఉండే అవకాశం కలదట. ఈసారి హౌస్ ని సీరియల్ బ్యాచ్ తో నింపిస్తున్నారని అంటున్నారు. ఇక నాలుగో పవర్ అస్త్ర పల్లవి ప్రశాంత్ కి దక్కింది. అతడికి రెండు వారాల ఇమ్యూనిటీ లభిస్తుంది...