ఎపిసోడ్ కి హైలెట్ గా 'మీమ్ ఆఫ్ ది వీక్'... పగలబడి నవ్వకపోతే ఒట్టు!
ఆదివారం ఎపిసోడ్ కి మీమ్ ఆఫ్ ది వీక్ హైలెట్ గా నిలిచింది. నవ్వులు పూయించింది. హోస్ట్ నాగార్జున సైతం గట్టిగా నవ్వేశారు.

సండే బిగ్ బాస్ షో ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగింది. నాగార్జున కొన్ని ఫన్నీ టాస్క్స్ పెట్టాడు. ప్రతి కంటెస్టెంట్ నేను చెప్పిన ఇద్దరు హౌస్ మేట్స్ లో తమ బోటులో ఎవరిని ఉంచుకుంటారో? ఎవరిని ముంచేస్తారో చెప్పాలని ఆదేశించాడు. గౌతమ్ కి నాగార్జున అర్జున్, ప్రియాంక పేర్లు చెప్పాడు. ఈ ఇద్దరిలో ఎవరిని సేవ్ చేస్తావు? ఎవరిని ముంచేస్తావు? అని అడిగారు.టఫ్ అని గౌతమ్, ప్రియాంకను సేవ్ చేస్తాను, అర్జున్ ని సింక్ చేస్తాను అన్నాడు. అర్జున్ కి గౌతమ్, అమర్ పేర్లు చెప్పాడు. అమర్ ని ముంచేసిన అర్జున్... గౌతమ్ ని సేవ్ చేశాడు. అమర్ కి రెండు పేర్లు చెప్పాడు. శోభా, ప్రియాంకలలో ఎవరిని సేవ్ చేస్తావు? ఎవరిని ముంచేస్తావని అడిగారు నాగార్జున. వాళ్ళ ఇద్దరి వలన నేను మునిగిపోయేలా ఉన్నానని అమర్ అన్నాడు.
ఇక యావర్ ని శివాజీ, రతికలలో ఎవరిని సేవ్ చేశావని అడగ్గా... శివాజీ పేరు చెప్పాడు. శివాజీ మాత్రం యావర్ ని ముంచేసి పల్లవి ప్రశాంత్ ని సేవ్ చేశాడు. ఇక తేజా.. శోభాను ముంచి యావర్ ని సేవ్ చేశాడు. భోలే... పల్లవి ప్రశాంత్ ని సేవ్ చేసి.. అశ్వినిని ముంచేశాడు. ఈ గేమ్ ఆసక్తికరంగా సాగింది.
అనంతరం 'డైలాగ్ కొట్టు గురూ' అనే ఫన్నీ గేమ్ ఆడించారు. ఒకరు హెడ్ ఫోన్ పెట్టుకొని లౌడ్ మ్యూజిక్ వింటూ ఉంటారు. ఎదుటివాళ్ళు ఒక డైలాగ్ చెబుతారు. హెడ్ ఫోన్ పెట్టుకున్న హౌస్ మేట్ ఆ డైలాగ్ లిప్ సింక్ ఆధారంగా కనిపెట్టాలి. ఈ గేమ్ అమర్-పల్లవి ప్రశాంత్ ఆడి గెలిచారు. యావర్-శోభా ఓడిపోయారు. తేజ-రతిక ఆడారు. ప్రియాంక-సందీప్ ఆడారు. గేమ్ అయితే ఫన్నీగా ఎంటర్టైనింగ్ గా సాగింది. అయితే నాగార్జున ప్లే చేసిన 'మీమ్ ఆఫ్ ది వీక్' నవ్వులు పూయించింది.
నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్-గౌతమ్ మధ్య జరిగిన గొడవను కోట బొమ్మాళి చిత్రంలోని 'లింగ్ లింగ్ లింగిడి' సాంగ్ కి సింక్ చేశారు. ఈ మీమ్ లో పల్లవి ప్రశాంత్, గౌతమ్, రతిక ఎక్స్ప్రెషన్స్ విపరీతమైన ఫన్ జెనెరేట్ చేశాయి. ఇక నిన్న ప్రియాంక, గౌతమ్ సేవ్ అయ్యారు. ఇంకా సందీప్, శివాజీ, అశ్విని, భోలే, శోభా, అమర్ నామినేషన్స్ లో ఉన్నారు. ఒకరు ఎలిమినేట్ కానున్నారు. సందీప్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం...