Bigg Boss Telugu 7: రైతుబిడ్డను టార్గెట్ చేసిన హౌస్... బయటకు పంపేందుకు భారీ స్కెచ్!
బిగ్ బాస్ హౌస్లో నేడు నామినేషన్స్ డే. కంటెస్టెంట్స్ మధ్య వాడి వేడి చర్చ నడుస్తుంది. సెకండ్ వీక్ నామినేషన్స్ లో హౌస్ మేట్స్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు..

సింపతీ కార్డు వర్కవుట్ అయితే ఆ కంటెస్టెంట్ ని ఆపడం కష్టం ఈ సీజన్లో ఆ క్రెడిట్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) కి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కామనర్ కోటాలో రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ వీక్ లో కూడా అతడు నామినేట్ అయ్యాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అతడు ఓటింగ్ లో టాప్ లో ఉన్నాడట. మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా 40% ఓట్లు అతడికే పడ్డాయట. పేదవాడు, రైతుబిడ్డ అనే విషయాలు పల్లవి ప్రశాంత్ కి కలిసొస్తున్నాయనేది నిజం. అందుకే ఆ స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
గతంలో కొందరికి ఈ సింపతీ కార్డు బాగా ఉపయోగపడింది. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ కావడానికి మెయిన్ రీజన్. అలాగే సీజన్ 4లో గంగవ్వ పాల్గొంది. అసలు గంగవ్వను నామినేట్ చేయడానికి కూడా హౌస్ మేట్స్ భయపడేవారు. ఆమెతో సన్నిహితంగా ఉంటే ఆమెపై ఉన్న సింపతీ ప్రేక్షకుల్లో మనకు కూడా దక్కుతుందని గంగవ్వతో ప్రేమగా వ్యవహరించేవారు. గంగవ్వ వలన కొన్ని టాస్క్స్ లో కంటెస్టెంట్స్ పూర్తి స్థాయిలో ఆడలేని పరిస్థితి. గంగవ్వను అనారోగ్య కారణాలతో బయటకు పంపాక హౌస్ సెట్ అయ్యింది.
లేటెస్ట్ సీజన్లో(Bigg Boss Telugu 7) పల్లవి ప్రశాంత్ కి ఈ అడ్వాంటేజ్ ఉంది. ఇది కొందరు కంటెస్టెంట్స్ కి బాగా తెలుసు. పల్లవి ప్రశాంత్ పై ఉన్న రైతుబిడ్డ అనే మార్క్ పోగొట్టాలి. అతడికి ప్రేక్షకుల్లో సింపతీ కలగకుండా చేయాలనే ప్రణాళిక సిద్ధం చేశారు. రైతులే కాదు అనేక వృత్తుల వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పే ప్రయత్నం చేశారు.
సోమవారం నామినేషన్స్ లో అమర్ దీప్ చౌదరి పల్లవి ప్రశాంత్ ని గట్టిగా టార్గెట్ చేశాడు. ఒక ఇంజనీర్ సరైన ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నాడని ఫైర్ అయ్యాడు. రైతుబిడ్డ అనే మాట వాడితే బాగోదు అన్నాడు. ప్రియాంక సింగ్, షకీలా, గౌతమ్ కృష్ణ, దామిని పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశారు. ఆట సందీప్ ''నువ్వే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ రైతు బిడ్డే'' అన్నాడు. మొత్తంగా పల్లవి ప్రశాంత్ కి ప్రేక్షకుల్లో సింపతీ దక్కకుండా చేస్తేనే ఎదుర్కోగలం అని భావించిన తెలివైన కంటెస్టెంట్స్ అటాక్ మొదలుపెట్టారు.