Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ నామినేషన్స్ డే ... తొడకొట్టిన రైతు బిడ్డ, తొక్కేసే ఆలోచనలో అమర్ దీప్, ప్రియాంక, సందీప్!


సోమవారం నామినేషన్స్ డే. హౌస్ వాడి వేడిగా సాగింది. అయితే ఇంకా నామినేషన్స్ ప్రక్రియ ముగియలేదు. 
 

bigg boss telugu 7 heat in the house as nominations on ksr
Author
First Published Sep 11, 2023, 11:31 PM IST

బిగ్ బాస్ తెలుగు 7లో నామినేషన్స్ ప్రక్రియ కూడా సరికొత్తగా ఉంది. గతంలో ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు పంథా మార్చారు. ఒక కంటెస్టెంట్ ని ఎంత మంది నామినేట్ చేయాలనుకుంటున్నారో బయటకు రావాలని అడుగుతున్నారు. ఆట సందీప్ ఇమ్యూనిటీ గెలుచుకున్న విషయం తెలిసిందే. కాబట్టి అతన్ని నామినేట్ చేయడానికి లేదు. అయితే ఆట సందీప్ కూడా ఒకరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. 

ప్రిన్స్ యావర్ హౌస్లో ఉండేదుకు అర్హుడు కాదని ఆట సందీప్ నామినేట్ చేశాడు. నాగార్జున కూడా నాకు మార్క్స్ వచ్చాయని చెప్పారు. నా కంటే తక్కువ మార్క్స్ వచ్చినవాళ్లు ఉన్నారు. నన్నెలా అనర్హుడని నామినేట్ చేస్తావని ప్రిన్స్ యావర్ ఆర్గ్యూ చేశాడు. అనంతరం తేజాను నామినేట్ చేసేవాళ్ళు ఎవరో రావాలని బిగ్ బాస్ ఆదేశించాడు. శుభశ్రీ, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్ కారణాలు చెప్పి టేస్టీ తేజాను నామినేట్ చేశారు. 

తర్వాత దామిని పేరు పిలిచాడు బిగ్ బాస్. అయితే ఆమెను నామినేట్ చేసేందుకు ఎవరూ ముందు రాలేదు. దాంతో ఆమె ఈ వారం నామినేషన్స్ నుండి తప్పుకుంది. తర్వాత నటుడు శివాజీ పేరు పిలిచారు. మొత్తం 5 మంది శివాజీని నామినేట్ చేశారు. అమర్ దీప్ చౌదరి, ప్రియాంక, షకీలా, దామిని, శోభా శెట్టి నామినేట్ చేశారు. వీరిలో ప్రియాంక సింగ్-శివాజీ మధ్య వాడి వేడి చర్చ నడిచింది. 

ఇక పల్లవి ప్రశాంత్ పేరు పిలవగా గౌతమ్ కృష్ణ, ప్రియాంక సింగ్, అమర్ దీప్ చౌదరి, రంగంలోకి దిగారు. పల్లవి ప్రశాంత్ ని ప్రియాంక, అమర్ దీప్ చౌదరి స్ట్రాంగ్ గా టార్గెట్ చేశారు. నువ్వు రైతు బిడ్డ అని చెప్పుకోవడానికి వీలు లేదు అన్నట్లు వాదించారు. రైతులే కాదు అన్ని రంగాల్లో ఇబ్బందులు ఉన్నాయి. నువ్వు సింపతీ వాడకు అని అమర్ దీప్ చౌదరి గట్టిగా చెప్పాడు. రైతుబిడ్డ అనే కామనర్ కి భారీగా ఓట్లు పడుతున్నాయని అమర్ దీప్ చౌదరి, ప్రియాంక సింగ్ గ్రహించారు. ఆ సింపతీ యాంగిల్ దూరం చేయాలని గట్టి ప్రయత్నం చేశారు. ఇలా హాఫ్ ఎలిమినేషన్స్ తో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. ఎవరు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారనేది రేపు తెలుస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios