బిగ్‌ బాస్‌ తెలుగు 7 షో ఈ సారి బాగా క్లిక్‌ అయ్యింది. మంచి రేటింగ్‌ వచ్చింది. తాజాగా అఫీషియన్‌ రేటింగ్‌ వచ్చింది. అత్యధిక రేటింగ్‌ సాధించి రికార్డు బ్రేక్‌ చేసిందట. 

బుల్లితెర రియాలిటీ షో `బిగ్‌ బాస్‌ తెలుగు 7` ఈ సారి మంచి ఆదరణ పొందింది. షో చాలా రసవత్తరంగా సాగింది. కంటెస్టెంట్ల ఆటలు ఆద్యంతం రక్తికట్టించాయి. అలాగే `ఉల్టాపుల్టా` అనే కాన్సెప్ట్ కూడా బాగా వర్కౌట్‌ అయ్యింది. దీంతో ది బెస్ట్ సీజన్‌గా నిలిచింది. రేటింగ్‌ పరంగానూ చాలా ఇతర టీవీ షోలను మించింది. ఎక్కువగా టీఆర్‌పీ రేటింగ్‌ సాధించిన షోగానూ నిలిచింది. 

ఈ నేపథ్యంలో ఇది మరో రికార్డు బ్రేక్‌ చేసింది. సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. బిగ్‌ బాస్‌ తెలుగు 7 గ్రాండ్‌ ఫినాలే రోజు అత్యధిక రేటింగ్‌ సాధించిన షోగా నిలిచింది. తాజాగా బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఈ విషయాన్ని ప్రకటించారు. గ్రాండ్‌ ఫినాలే రోజు ఇది 21.7 టీవీఆర్‌(టెలివిజన్‌ రేటింగ్‌) సాధించిన షోగా నిలిచింది. టీవీ షోస్‌కి సంబంధించి ఇంత రేటింగ్ రావడం గొప్ప విషయమనే చెప్పాలి. అదే సమయంలో రికార్డు బ్రేకింగ్‌ రేటింగ్‌ అంటూ టీమ్‌ ప్రకటించింది. 

గ్రాండ్‌ ఫినాలే రోజులు కల్చరల్‌ ఈవెంట్లు, స్టార్ల డాన్సు ప్రోగ్రాములు, మధ్యలో రవితేజ, సుమ, కళ్యాణ్‌ రామ్‌ వంటి వారు ఎంట్రీ ఇవ్వడం మొత్తంగా షోని ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అదే సమయంలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారు, ఎవరు ప్రైజ్‌ మనీకి టెంప్ట్ అవుతారనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. వీటన్నింటిని పక్కన పెడితే విన్నర్‌ ఎవరు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. దీనిపైనే ఎక్కువ చర్చ జరిగింది. అంతేకాదు శివాజీ, అమర్‌ దీప్‌, అర్జున్‌లను కాదని, పల్లవి ప్రశాంత్‌ బిగ్‌ బాస్‌ 7 విన్నర్‌గా నిలవడం విశేషంగా నిలిచింది. ముందు నుంచే పల్లవి ప్రశాంత్‌ విన్నర్‌ అనే ప్రచారం ప్రారంభమైంది. దీంతో అందరిలోనూ క్యూరియాసిటీ ఏర్పడింది. అది ఫైనల్‌ రోజు ప్రతింబించింది. 

ఇక నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌ బాస్‌ తెలుగు 7 బెస్ట్ సీజన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో షోకి రంగం సిద్ధమవుతుంది. ఓటీటీ షోని ప్రారంభించేందుకు ప్లాన్ జరుగుతుంది. ఫిబ్రవరి నుంచే ఇది స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం కంటెస్టెంట్ల వెతుకులాట సాగుతుందని తెలుస్తుంది.