సారాంశం


బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండు టీమ్స్ గా విభజించాడు. ఈ క్రమంలో ప్రత్యర్థులుగా ఉన్న రతిక, అమర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
 


బిగ్ బాస్ సీజన్ 7 తొమ్మిదో వారం కెప్టెన్సీ రేస్ మొదలైంది. ఇందుకు హౌస్ మేట్స్ ని  వీర సింహాలు వర్సెస్ గర్జించే పులులు అని రెండు టీమ్స్ గా డివైడ్ చేశారు బిగ్ బాస్. కెప్టెన్సీ రేస్ లో భాగంగా మరో కొత్త టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో కాయిన్స్ కోసం కంటెస్టెంట్స్ స్టోర్ రూమ్ కి పరుగులు తీశారు. అమర్ దీప్ తమకు కేటాయించిన బ్యాగ్స్  తో పాటు అవతలి టీం బ్యాగ్స్  తీసుకుని వాటిని కింద పడేసాడు. దీంతో ఆపోజిట్ టీం లో ఉన్న రతిక ఎందుకు బ్యాగ్స్ పడేసావ్ అని అమర్ ని నిలదీసింది.ఇది నా స్ట్రాటజీ .. నా ఇష్టం అంటూ అమర్ అన్నాడు. 

దీంతో రతిక 'ఎందుకు వెధవ పనులు చేస్తావ్' అని అమర్ మీద నోరు జారింది. దాంతో అమర్ రెచ్చిపోయాడు. ' నువ్వు చేసిన  వెధవ పనులు కంటే కాదులే'  బయట ఊస్తారు అంటూ  నోటికొచ్చింది మాట్లాడాడు. మాటలు జాగ్రత్తగా మాట్లాడు అంటూ రతిక వార్నింగ్ ఇచ్చింది. నువ్వు కూడా .. జాగ్రత్తగా మాట్లాడు. భయపెడితే భయపడతా అనుకుంటున్నావా .. పక్కకెళ్ళి ఆడుకో.. దమ్ముంటే నా బ్యాగ్ లాగడం కాదు .. నీ దగ్గర లాక్కున్న వాళ్ళ దగ్గర లాక్కో అంటూ రివర్స్ అయ్యాడు అమర్. 

ఆ తర్వాత 'బ్రేక్ ఫాస్ట్'  అంటూ మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో అమర్ దీప్,శోభా శెట్టి పోటీ పడ్డారు. ముందుగా  హేమార్ సహాయంతో  గ్లాస్ బ్రేక్  చేయాలి.  తర్వాత  వుడెన్ బోర్డ్ లో ఉన్న స్లాట్స్ లో బుల్లెట్స్ ఫిట్ చేయాలి.కాగా అమర్ దీప్ చాలా దూకుడుగా కనిపించాడు.నిన్నటి టాస్క్ లో కూడా అమర్ చాలా బాగా ఆడాడు.   

శోభా కంటే చాలా స్ప్పేడ్ గా టాస్క్ కంప్లీట్ చేసి గంట మోగించాడు.అమర్ దీప్ టీం ని గెలిపించాడు. ఇక అర్జున్,శివాజీ వచ్చి హగ్ చేసుకున్నారు. అమర్ ని అభినందించారు. మొన్నటి వరకు ఒకరినొకరు టార్గెట్ చేసుకుని వాదించుకున్న అమర్,శివాజి లు టాస్క్ లో కలిసిపోయి ఆడుతున్నారు.     

YouTube video player