Asianet News TeluguAsianet News Telugu

నన్ను అందుకే బయటకు పంపారు... పల్లవి ప్రశాంత్ పేరు ప్రస్తావిస్తూ సందీప్ సంచలన పోస్ట్!


8వ వారం ఎలిమినేట్ అయిన ఆట సందీప్ అసంతృప్తిగా ఉన్నాడు. ఆయన సోషల్ మీడియా పోస్ట్ లో ఇది స్పష్టంగా అర్థం అవుతుంది. సందీప్...  నన్ను అందుకే బయటకు పంపారంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. 
 

bigg boss telugu 7 eliminated contestant aata sandeep shocking post ksr
Author
First Published Nov 2, 2023, 8:14 PM IST | Last Updated Nov 2, 2023, 8:14 PM IST

బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండుగా విభజించాడు. యావర్, గౌతమ్, తేజ, శోభా శెట్టి, రతిక ఒక టీం. శివాజీ, అర్జున్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, అశ్విని మరొక టీమ్. జంపింగ్ జపాంగ్ టాస్క్ లో యావర్ టీమ్ గెలిచింది. దీంతో బిగ్ బాస్ ఆ టీమ్ కి ఒక అవకాశం ఇచ్చాడు. ఎదురు టీమ్ నుండి ఒకరిని డెడ్ చేయవచ్చు. డెడ్ చేసిన సభ్యులు టాస్క్స్ ఆడటానికి లేదు. 

ఫిజికల్, మెంటల్ అనే తేడా లేకుండా టాస్క్స్ లో పల్లవి ప్రశాంత్ దుమ్ములేపుతున్నాడు. దీంతో గౌతమ్ ప్రత్యర్థి టీమ్ నుండి ప్రశాంత్ ని డెడ్ చేశాడు. పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ టాస్క్స్ ముగిసే వరకు డెడ్ బోర్డు మెడలో వేసుకుని తిరగాల్సిందే. కెప్టెన్ అయ్యే ఛాన్స్ కూడా అతనికి లేడు. ఈ క్రమంలో సందీప్ ఫైర్ అయ్యాడు. ఆట సందీప్ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. 

''పాపం పల్లవి ప్రశాంత్... గుడ్ ప్లేయర్. వాడిని ఎందుకు డెడ్ చేశారు??.  ప్రశాంత్ ఉంటే ఆట ఆడలేరా? భయమా? స్ట్రాంగ్ ప్లేయర్స్ తో ఆడండి. స్ట్రాంగ్ ప్లేయర్స్ ని బయటకు పంపి ఆడితే కిక్కు ఉండదు. అప్ కోర్స్ నన్ను కూడా అందుకే బయటకు పంపారు. నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని!'' అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. సందీప్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ వైరల్ అవుతుంది. 

8వ వారం శోభా శెట్టి, సందీప్ డేంజర్ జోన్లోకి వచ్చారు. శోభా శెట్టి ఎలిమినేట్ కానుందని ప్ ప్రచారం జరిగింది. అనూహ్యంగా సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. సోషల్ మీడియా జనాలు మాత్రం శోభా శెట్టి ఎలిమినేట్ కావాలని కోరుకున్నారు. తన ఎలిమినేషన్ పట్ల అసంతృప్తిగా ఉన్న సందీప్ ఈ కామెంట్స్ చేశాడని స్పష్టంగా అర్థం అవుతుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios