ఫన్ డే అంటూ కంటెస్టెంట్స్ ఏడిపించిన నాగార్జున... తలుపులు తెరుచుకోగా ఆమె వచ్చేసింది!
నేడు బిగ్ బాస్ మేకర్స్ దసరా స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఏడుగంటల నుండే ఎపిసోడ్ ప్రసారం కానుంది. కాగా కొన్ని ఆసక్తికర విషయాలు హౌస్లో చోటు చేసుకున్నాయి.
పండగ వేళ బిగ్ బాస్ ఎపిసోడ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. పాయల్ రాజ్ పుత్, డింపుల్ హయాతి వంటి బోల్డ్ హీరోయిన్స్ హాట్ పెరఫామెన్స్ ఇస్తున్నారు. అలాగే సింగర్స్ దుమ్మురేపే పాటలతో ఎంటర్టైనర్ చేయనున్నారు. ఇంటి సభ్యులు సంప్రదాయ దుస్తుల్లో అద్బుతంగా తయారయ్యారు. వీరితో నాగార్జున సరదా ఆటలు ఆడారు. సీరియల్ బ్యాచ్ ప్రియాంక-శోభాలతో నాగిని డాన్సు వేయించాడు. అర్జున్, అశ్విని పోల్ డాన్స్ చేయాలని కోరాడు.
ఇక తేజా ఒంటిపై శోభా టాటూ గోలా నాగార్జున కూడా వదల్లేదు. శోభా అని కాకపోయినా బుజ్జమ్మ అని వేయించుకోవాలని నాగార్జున తేజాను కోరాడు. బుజ్జి తీసేసి అమ్మా అని వేయించుకుంటా... అని తేజా తెలివైన సమాధానం చెప్పాడు. మరిన్ని సరదా ఆటలు ఆడిన అనంతరం నాగార్జున కొందరు ఇంటి సభ్యులకు పండగ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంటి సభ్యులు రాసిన లెటర్స్ అందించారు. గతంలో కొందరు ఫ్యామిలీ మెంబర్స్ రాసిన లెటర్స్ కోల్పోయారు.
అలా ఫ్యామిలీ మెంబర్స్ రాసిన లెటర్ త్యాగం చేసిన వాళ్లకు మరో లెటర్ వచ్చింది. అమర్ కి భార్య తేజస్విని రాసింది. యావర్ కి అన్నయ్య, శోభాకి వాళ్ళ అమ్మ లెటర్స్ రాశారు. ఆ లెటర్స్ చదువుతూ యావర్, శోభా కన్నీళ్లు పెట్టుకున్నారు. వీటన్నింటికీ మించిన సర్ప్రైజ్ ఆమె రీ ఎంట్రీ. ఎలిమినేట్ అయిన దామిని, శుభశ్రీ, రతికా రోజ్ లలో హౌస్ మేట్స్ ఓటింగ్ ఆధారంగా ఒకరు హౌస్లోకి రానున్నారు. తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకు అవకాశం అని నాగార్జున మెలిక పెట్టిన నేపథ్యంలో రతికా రోజ్ ఎంట్రీ కన్ఫర్మ్ అంటున్నారు. ఆమె ఎవరో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాలి...
ఈ వారం నామినేషన్స్ లో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, గౌతమ్, తేజా, అశ్విని, భోలే, పూజ ఉన్నారు. తక్కువ ఓట్లు తెచ్చుకున్న పూజ ఎలిమినేట్ కానుందట. వరుసగా రెండో వైల్డ్ కార్డు ఇంటిని వీడటం ఊహించని పరిణామం. గత వారం ఎలిమినేట్ అయిన నయని పావని కూడా వైల్డ్ కార్డు ఎంట్రీనే.