Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7 : భోలే ఎలిమినేటెడ్.. శ్రీలీలాను ఆటపట్టించిన నాగ్, ఆది పంచుల వర్షంతో అదిరిన దివాళీ స్పెషల్

దివాళీ స్పెషల్ తో బిగ్ బాస్ తెలుగు 7 ఆదివారం ఎపిసోడ్ అదిరిపోయింది. సెలబ్రెటీలతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ స్టేజీపై సందడిచేశారు. ఈ వారం భోలే ఎలిమినేటెడ్ అయ్యారు. 

Bigg Boss Telugu 7 Diwali Special Episode Bhole Shavali Eliminated NSK
Author
First Published Nov 12, 2023, 11:22 PM IST


బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆదివారం చాలా ఆసక్తికరంగా సాగింది. దీపావళి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ మరింత ప్రత్యేకంగా మారింది. ఈ సందర్భంగా నాగార్జున్ ట్రెడిషనల్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు. అదరిపోయే డాన్స్ తో అదరగొట్టారు. బిగ్ బాస్ ప్రేక్షకులకు, కంటెస్టెంట్లకు నాగ్ శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్బంగా హౌజ్ మేట్స్ కు ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు. ఒక్క నిమిషం ట్రైమ్ ఫ్రేమ్ లో ఐదు టీమ్ లు క్రాకర్స్ కార్డ్స్ ను తమ బుట్టలో వేయాల్సి ఉంటుంది. వాటికి మార్క్ లు ఇష్తారు. ఈ గేమ్ లో యావర్ - అశ్విని, అమర్ దీప్ -ప్రియాంక, బోలే - అర్జున్, గౌతమ్ - శోభా,  యావర్ - రతిక టీమ్ గా ఆడారు. అమర్ దీప్ - ప్రియాంక 410 స్కోర్ చేశారు. వారిని నాగ్ అభినందించారు. ఇక లీస్ట్ లో గౌతమ్ కృష్ణ - శోభా 75 స్కోర్ చేశారు. 

టాస్క్ గెలిచిన అమర్ దీప్ కు బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చారు. హౌజ్ లోకి అమర్ తల్లి, హీరో మానస్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమర్, తల్లితో ఎమోషనల్ అయ్యారు. మానస్ అమర్ తోపాటు మిగితా కంటెస్టెంట్లకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణకూ సర్ ప్రైజ్ ఇస్తూ ఆయన బ్రదర్స్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నామినేషన్ లో ఉన్న గౌతమ్ ను సేవ్ చేశారు. 

తర్వాత వివిధ రకాల కలర్స్ గల కవర్స్ కలిగిన చాక్లెట్స్ ను కంటెస్టెంట్లకు అందించారు. కలర్ ను బట్టి పోటీదారుల్లోని నెగెటివ్, ఇగ్నోర్, నాట్ వర్తీలను తెలుపుతూ చాక్లెట్స్ ను అందించారు. ఎక్కువ చాక్లెట్స్ వచ్చిన అమర్, రతికలను మరింత మంచిగా ఆడాలని సూచించారు.  ఈ గేమ్ లోనే శోభాశెట్టి తన ప్రియుడి పేరును రివీల్ చేయడం ఆసక్తికరంగా మారింది. మూడేళ్లుగా శోభా యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తితో రిలేషన్ లో ఉందని తానే స్వయంగా చెప్పింది. ముద్దుగా ‘పాపు’ అని పిలుచుకుంటానని చెప్పుకొచ్చింది. 

దివాళీ స్పెషల్ ఎపిసోడ్ కావడంతో హౌజ్ లోకి గెస్ట్ లుగా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela), పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) వచ్చారు. ఈ సందర్భంగా నాగ్ శ్రీలీలాపై ఫన్నీ కామెంట్స్, టాస్క్ లతో ఆడుకున్నారు. శ్రీలీలా, వైష్ణవ్ తో డాన్స్ కూడా వేయించారు. తమ రాబోయే సినిమా ‘ఆదికేశవ’కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. అలాగే కాజల్ అగర్వాల్, బుచ్చిబాబు, సోహెల్, ఇమ్మానుయేల్, రితికా సింగ్, ఫరియా అబ్దుల్లా తదితరులు స్టైజీపై సందడి చేశారు.

ఇక ఈ వారం నామినేషన్స్ లో రతికా, భోలే షావలి, యావర్ చివరి వరకు వచ్చారు. తర్వాతి టాస్క్ లో రతికా సేఫ్ జోన్ లోకి వెళ్లింది. నెక్ట్స్ భోలే, యావర్ లో ఒకరు హౌజ్ ను వీడిపోవాల్సి వచ్చింది. ఎలిమినేషన్ రౌండ్ కు ముందు కమెడియన్ హైపర్ ఆది స్టైజీపై సందడి చేశారు. సీజన్ ప్రారంభం నుంచి నాగ్ హోస్ట్, కంటెస్టెంట్లు ఆటతీరును వివరించారు. ఈ క్రమంలో తనదైన శైలిలో పంచుల వర్షం కురిపించారు. కంటెస్టెంట్లలను తెగ నవ్వించారు. ఇక ఎలిమినేషన్ టైమ్ లో  చివరికి హౌజ్ ను భోలే షావలి వీడారు. హౌజ్ లో ఐదు వారాల పాటు అద్భుతమైన ఆటతో ప్రేక్షకులను అలరించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios