Asianet News TeluguAsianet News Telugu

కిచెన్ లో శివాజీ X శోభా శెట్టి.. కేకలు పెడుతూ తిట్టిపోసుకున్న కంటెస్టెంట్స్, గొడవ యావర్ వల్లే

 కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 7షో గురువారం రోజు ఎక్కువగా కిచెన్ లోనే సాగింది. యావర్ వల్ల కిచెన్ లో చిన్న పాటి చిచ్చు రగులుకుంది. ఆ చిచ్చు మెల్లగా పెద్దదై శోభా శెట్టి వెర్సస్ శివాజీగా గొడవగా మారింది.

bigg boss telugu 7 day 25 highlights dtr
Author
First Published Sep 28, 2023, 10:29 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 7షో గురువారం రోజు ఎక్కువగా కిచెన్ లోనే సాగింది. యావర్ వల్ల కిచెన్ లో చిన్న పాటి చిచ్చు రగులుకుంది. ఆ చిచ్చు మెల్లగా పెద్దదై శోభా శెట్టి వెర్సస్ శివాజీగా గొడవగా మారింది. గురువారం రోజు జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 హైలైట్స్ చూద్దాం. 

నేటి ఎపిసోడ్ లో శోభా శెట్టి కేకలు, గ్లామర్ మాత్రమే హైలైట్ గా నిలిచాయి. ఆమె పొట్టి బట్టల్లో థైస్, వీపు చూపిస్తూ హౌస్ లో సందడి చేసింది.ఆమె హెయిర్ స్టైల్ చూసి బొప్పి కట్టిందా అని తేజ సెటైర్ వేశాడు. నీలాంటి ఎర్ర బస్సు వాళ్ళకి ఇలాంటి చోట ఆఫర్ ఇవ్వకూడదు.. తెలియకుండా ఇచ్చారు అంటూ శోభా శెట్టి కౌంటర్ వేసింది. 

ఇంతలో యావర్ వల్ల  కిచెన్ లో గొడవ మొదలైంది. హౌస్ మేట్స్ కొంతమంది చపాతీలు, రోటీలు చేస్తున్నారు. తినేవాళ్లు అక్కడే తింటున్నారు. కానీ యావర్ ప్రశాంత్ బయట లాన్ లో బజర్ కి దగ్గరగా కూర్చుని తినడం కొంతమందికి నచ్చలేదు. పైగా యావర్ కిచెన్ వద్దకు రాకుండా ప్రశాంత్ తో ఫుడ్ తెప్పించుకున్నాడు. 

దీనితో ఆట సందీప్ యావర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ప్రియాంక జైన్, శోభా శెట్టి కూడా యావర్ ని తప్పు బట్టారు. కానీ శివాజీ మాత్రం యావర్ కి సపోర్ట్ చేసారు. ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు అని అడిగాడు. దీనితో శోభా శెట్టి, శివాజీ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఒకరినొకరు దూషించుకుంటూ వేళ్ళు చూపించుకుంటూ గొడవ పడ్డారు. నాకు సలహాలు ఇవ్వొద్దు అంటూ శోభా మండిపడింది. శివాజీ కూడా శోభా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అనంతరం టాస్క్ లో భాగంగా యావర్ ముందుగా బజర్ నొక్కడం జరిగింది. దీనితో యావర్ తన పార్ట్నర్ గా ప్రశాంత్ ని ఎంచుకున్నాడు. ప్రత్యర్థులుగా అమర్ దీప్, గౌతమ్ లని ఎంచుకున్నారు. వీళ్ళకి బిగ్ బోస్ కన్నీళ్లతో గ్లాస్ నింపే టాస్క్ ఇచ్చారు. ఇందులో యావర్, ప్రశాంత్ విజయం సాధించడం తో అమర్ దీప్, గౌతమ్ తమ కాయిన్స్ మొత్తం కోల్పోయారు. 

యావర్ 118 కాయిన్స్ తో అగ్రస్థానంలో, ప్రశాంత్ 110 కాయిన్స్ తో రెండవ స్థానంలో నిలిచారు. దీనితో వీరిద్దరూ పవర్ అస్త్ర కంటెండర్స్ గా అర్హత సాధించనట్లు బిగ్ బాస్ ప్రకటించారు. అనంతరం హౌస్ లో గాలా ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో శోభా శెట్టి ఎల్లో శారీ లో అందాలు ఆరబోస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios