Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: టేస్టీ తేజ ఎలిమినేషన్... గుండెలు పగిలేలా ఏడ్చిన శోభ!


ఈవారం టేస్టీ తేజ ఎలిమినేషన్ ఖాయమే అంటున్నారు. దీనికి సంబంధించి రంగం సిద్దమైంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న తేజ నేడు ఇంటిని వీడనున్నాడు. 
 

bigg boss telugu 7 contestant tasty teja eliminating today ksr
Author
First Published Nov 5, 2023, 11:33 AM IST

బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది. నేడు సండే కాగా హోస్ట్ నాగార్జున ఒకరికి గుడ్ బై చెప్పనున్నాడు. గత వారం ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. సందీప్ నిష్క్రమణతో హౌస్లో 12 మంది మిగిలారు. శివాజీ, ప్రశాంత్, అశ్విని నామినేట్ కాలేదు. గౌతమ్ కెప్టెన్ హోదాలో మినహాయింపు పొందాడు. మిగిలిన యావర్, అమర్, తేజ, ప్రియాంక, భోలే, శోభ, రతిక, అర్జున్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఒకరు ఎలిమినేట్ అవుతారు. 

పలు మీడియా సంస్థల ఓటింగ్ లెక్కల ప్రకారం ప్రియాంక, శోభ డేంజర్ జోన్లో ఉన్నారు. వీరికి తక్కువ ఓట్లు వచ్చాయట సమాచారం. ముఖ్యంగా సోషల్ మీడియాలో శోభ మీద భారీ నెగిటివిటీ నడుస్తుంది. ఆమె ఆటతీరు, యాటిట్యూడ్ నచ్చని ప్రేక్షకులు ఎలిమినేట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఓటింగ్ కూడా తక్కువ నమోదు అవుతుంది. 

8వ వారం శోభ ఎలిమినేట్ కావాల్సింది. అయితే అన్ ఫెయిర్ ఎలిమినేషన్ ద్వారా సందీప్ ని బలి చేశారనే వాదన వినిపించింది. ఈసారి మరొకరు ఆమె ఖాతాలో బలి అయ్యారట. శోభకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు టేస్టీ తేజను ఇంటికి పంపుతున్నారట. ఈ వారం తేజ గుడ్ బై చెప్పనున్నాడట. అతని జర్నీ వీడియో సిద్ధం చేశారట. అలాగే తేజ ఎలిమినేషన్ షూటింగ్ కూడా పూర్తి అయ్యిందట. 

తేజ హౌస్లో మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు. తన మార్క్ జోక్స్, పంచ్లలతో పాపులర్ అయ్యాడు. తేజ శోభతో అత్యంత సన్నిహితంగా ఉంటాడు. సీరియల్ బ్యాచ్ కి చెందిన శోభ... ప్రియాంక, అమర్ కంటే కూడా తేజను ఎక్కువగా ఇష్టపడుతుంది. తేజ ఎలిమినేషన్ తో శోభ గుండెలు పగిలేలా ఏడ్చిందని సమాచారం. ఇక తొమ్మిది వారాలకు తేజ రూ. 13.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారట. 
 

Follow Us:
Download App:
  • android
  • ios