కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ ముందు ఏడ్చేసిన శివాజీ... పర్మినెంట్ గా పంపించే ఛాన్స్?
కంటెస్టెంట్ శివాజీ బిగ్ బాస్ హౌస్లో గాయపడిన విషయం తెలిసిందే. కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఎలా ఉందని బిగ్ బాస్ అడగ్గా, శారీరక, మానసిక గాయాలను చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు.
ఓ ఫిజికల్ టాస్క్ లో పాల్గొన్న శివాజీ భుజానికి గాయమైంది. దీంతో స్కానింగ్ కోసం బిగ్ బాస్ బయటకు పంపాడు. ప్రస్తుతం శివాజీ కుడి చేయికి సపోర్టర్ ధరించి కనిపిస్తున్నాడు. ఫిజికల్ టాస్క్ లలో అతన్ని ఇన్వాల్వ్ చేయడం లేదు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఫిజికల్ గా పెద్దగా కష్టపడే అవకాశం లేని టాస్క్స్ ఇచ్చారు. ఇంటి సభ్యులను గులాబీ పురం, జిలేబి పురం అంటూ రెండు టీమ్స్ గా విభజించారు. రెండు టీమ్స్ సభ్యులకు బిగ్ బాస్ కొన్ని పాత్రలు కేటాయించాడు.
ఆ పాత్రల్లో వీరు ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. మధ్యలో మధ్యలో టాస్క్స్ పెట్టాడు. ఎక్కువ టాస్కుల్లో నెగ్గిన జిలేబి పురం సభ్యులు కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. అర్జున్, శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అశ్విని, సందీప్ జిలేబీ టీమ్ లో ఉన్నారు. వీరిలో ఒకరు కెప్టెన్ అవుతారు.కాగా ఓడిపోయిన గులాబీ పురం సభ్యులు వీరిలో ఎవరు కెప్టెన్ కి అర్హులు కాదో ప్రతి ఒకరు ఒకరి పేరు చెప్పాలి. అమర్ శివాజీ పేరు చెప్పాడు.
గాయం కారణం శివాజీ టాస్క్లు ఆడలేదు. పెద్దగా కష్టపడలేదు అందుకే కెప్టెన్సీకి అనర్హుడని అమర్ అన్నాడు. నేను కూడా కష్టపడ్డాను అన్న శివాజీ... అయితే మీ అందరిలో నేను వేస్ట్ కాండిడేట్ నా అన్నాడు. మీరు కష్టపడ్డారు. కాకపోతే మీకంటే ఎక్కువ కష్టపడిన వాళ్లకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అన్నాడు అమర్. దాంతో శివాజీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ కోల్పోయాడు.
అనంతరం శివాజీని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. హెల్త్ ఎలా ఉందని అడిగాడు. చేయి నొప్పి. మొత్తం లాగేస్తుంది. అందరి ముందు ఏడవలేకపోతున్నాను. ఎవరైనా ఉన్నప్పుడు నవ్వుతూ మనసులో ఏడుస్తున్నాను. నువ్వు ఆడటం లేదని అమర్ ఇండైరెక్ట్ గా అనేసరికి బాధేసిందని కన్నీరు పెట్టుకున్నాడు. శివాజీని భుజం గాయం బాగా ఇబ్బంది పెడుతుందని అర్థం అవుతుండగా... బిగ్ బాస్ పర్మినెంట్ గా బయటకు పంపే అవకాశం కలదు. గతంలో గంగవ్వ, నోయల్ లను అనారోగ్య కారణాలతో బిగ్ బాస్ ఎలిమినేట్ కాకుండానే బయటకు పంపారు...