Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి కాకుండానే ప్రియుడితో కాపురం చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..!

ఈ రోజులో సహజీవనం ట్రెండ్ అయిపోయింది. బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ తన ప్రియుడితో చాలా కాలంగా ఒకే ఇంట్లో కలిసి ఉంటుంది. ఆమె ఎవరో కాదు ప్రియాంక జైన్. 
 

bigg boss telugu 7 contestant priyanka jain in living relationship with lover shiva kumar  ksr
Author
First Published Feb 9, 2024, 4:25 PM IST | Last Updated Feb 9, 2024, 4:25 PM IST

ప్రియాంక జైన్ బిగ్ బాస్ తెలుగు 7 ఫైనలిస్ట్స్ లో ఒకరు. అబ్బాయిలకు పోటీ ఇచ్చిన ఒకే ఒక లేడీ కంటెస్టెంట్. ప్రియాంక జైన్ 5వ స్థానంలో నిలిచారు. ఈ షో వేదికగా ప్రియాంక జైన్ తన ప్రియుడిని పరిచయం చేసింది. సీరియల్ నటుడు శివ కుమార్ తో ఆమె చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నారు. ఫ్యామిలీ వీక్ లో శివ కుమార్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాడు. ప్రియాంకను ముద్దుల్లో ముంచెత్తాడు. ప్రియాంక జైన్ హౌస్లోనే పెళ్లి చేసుకుందాం అంది. నువ్వు బయటకు వచ్చాక చేసుకుందామని శివ కుమార్ చెప్పాడు. 

మౌనరాగం సీరియల్ లో కలిసి నటించిన శివ కుమార్-ప్రియాంక ప్రేమలో పడ్డారు. వీరు సహజీవనం చేస్తున్నారు. ఇటీవల ఈ విషయం మీద ఓపెన్ అయ్యారు. పెళ్లి కాకుండా కలిసి జీవించడం పై విమర్శలు రావడంతో శివ కుమార్ వివరణ ఇచ్చాడు. ప్రియాంక పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలి అనుకుంటుంది. అందుకు చాలా డబ్బు కావాలి. అందుకే ఆలస్యం అవుతుంది. ఈ లోపు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంటే ఆమె వినలేదు అన్నాడు. 

తాజాగా ఈ జంట స్టార్ మా పరివార్ షోకి వచ్చారు. వాలెంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో పలువురు బుల్లితెర సెలబ్రిటీ కపుల్స్ పాల్గొన్నారు. శ్రీముఖి వీరిద్దరికి కిస్ టాస్క్ ఇచ్చింది. శివ కుమార్ ప్రియాంక బుగ్గపై ముద్దు పెట్టాడు. ''అమర్ దీప్-తేజస్విని తల్లిదండ్రులు కాబోతున్నారు, మీ సంగతి ఏంటి?' అని శ్రీముఖి అడిగింది. శ్రీముఖి మాట అందుకున్న అవినాష్... 'వాళ్ళు పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు. వీరిద్దరు మాత్రం పెళ్లి చేసుకోకుండా కాపురం చేస్తున్నారు' అని షాకింగ్ కామెంట్ చేశాడు. 

ప్రియాంక-శివ కుమార్ పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉంటున్నారన్న విషయం మరోసారి రుజువైంది. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారనే వాదన ఉంది. మరోవైపు ప్రియాంక సీరియల్స్ కి షార్ట్ బ్రేక్ ఇచ్చింది. షోకి వెళ్లక ముందు ప్రియాంక జానకి కలగనలేదు సీరియల్ లో నటించింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios