ఆ ఒక్క నిర్ణయంతో హీరో అయిపోయిన యావర్... ఇది మామూలు త్యాగం కాదు భయ్యా!
ప్రిన్స్ యావర్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. అతడు బిగ్ బాస్ ఆడియన్స్ హృదయాలు గెలిచాడు.

బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ ప్రవర్తన ఆధారంగా ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అందుకే సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా ఫలితాలు వస్తుంటాయి. ఈ సీజన్లో అమర్ దీప్, ప్రియాంక శోభా శెట్టి, శివాజీ టాప్ సెలెబ్స్ హోదాలో హౌస్లో అడుగుపెట్టారు. శివాజీ అంచనాలకు తగ్గట్టు ఆడుతున్నాడు. అమర్ దీప్ తో పాటు ప్రియాంక, శోభా తేలిపోయారు. అనూహ్యంగా పల్లవి ప్రశాంత్, యావర్ వంటి ఫేమ్ లేని కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ దూసుకుపోతున్నారు. పల్లవి ప్రశాంత్ ని తక్కువ చేసి మాట్లాడి రతికార్ రోజ్ ఇంటికి వెళ్ళిపోయింది. ఈ లిస్ట్ లో అమర్ దీప్ కూడా ఉన్నాడు.
పల్లవి ప్రశాంత్ ఏకంగా ఫస్ట్ కెప్టెన్ అయ్యాడని సమాచారం. ఇదిలా ఉంటే యావర్ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా చిట్టీ ఆయారే టాస్క్ నిర్వహించాడు. ఈ టాస్క్ లో ఇప్పటి వరకు జంటలుగా పోటీ పడ్డ కంటెస్టెంట్స్ తమ బడ్డీస్ తో పోరాడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి ప్రతి ఒక్కరికీ ఓ లెటర్ వచ్చింది. అయితే ఒక్కరే ఆ లెటర్ తీసుకోవాలి. మరొకరు త్యాగం చేయాలి. త్యాగం చేసిన కంటెస్టెంట్ లెటర్ చదవలేడు. అలాగే కెప్టెన్సీ కంటెండర్ నుండి తప్పుకోవాలి.
ఈ టాస్క్ లో కొందరు పోటీపడ్డారు. కొందరు మాత్రం స్వచ్ఛందంగా ఇతరులను గెలిపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. గౌతమ్ అయితే దారుణంగా తన టీమ్ మేట్ శుభశ్రీని బ్లాక్ మెయిల్ చేసి టాస్క్ గెలిచాడు. నువ్వు నీ లెటర్ త్యాగం చేయకపోతే ఎప్పటికీ మాట్లాడను అని భయపెట్టాడు. శివాజీ పల్లవి ప్రశాంత్ ని గెలిపించాడు. డోంట్ వర్రీ నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది. నువ్వు లెటర్ తీసుకో... నేను నా లెటర్ త్యాగం చేస్తా అన్నాడు.
ఈ టాస్క్ లో అందరి కంటే యావర్ మెప్పించాడు. ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించాడు. తేజా, యావర్ లలో ఒకరు త్యాగం చేయాల్సి ఉంది. నువ్వు మీ అన్నయ్యను ఎంతగా మిస్ అవుతున్నావో తెలుసు... నువ్వు లెటర్ తీసుకో, నేను త్యాగం చేస్తా అన్నాడు. ఒక ప్రక్క లెటర్ కోసం ఏడుస్తూనే యావర్ దానికి అంగీకరించలేదు. ఒకరిని బాధపెట్టి నేను టాస్క్ లో ముందుకు వెళ్ళలేను, అన్నాడు.
తేజా ఎంత బ్రతిమిలాడినా యావర్ లెటర్ తీసుకుని కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు మొగ్గు చూపలేదు. ఇద్దరి మధ్య చాలా సేపు ఎమోషనల్ డ్రామా చోటు చేసుకుంది. ఫైనల్ గా ఇక నీ ఇష్టం అని తేజా తన లెటర్ కూడా యావర్ కి ఇచ్చేశాడు. తన లెటర్ మిషన్ లో వేసి డిస్పోజ్ చేసిన యావర్, తేజాకు లెటర్ ఇచ్చి కెప్టెన్సీ రేసు నుండి తప్పుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో యావర్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు...