Bigg Boss Telugu 7: పూజ మూర్తి రెమ్యూనరేషన్ అన్ని లక్షలా? యావర్ కంటే ఎక్కువంటగా!
టాప్ సెలెబ్ హోదాలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన పూజ మూర్తి జర్నీ జస్ట్ రెండు వారాలకే ముగిసింది. అయితే రెమ్యూనరేషన్ గట్టిగానే తీసుకుందట.
రీ లాంచ్ ఈవెంట్ ద్వారా ఐదుగురు సెలెబ్స్ ని ఇంటిలోకి పంపారు. వారిలో పూజ మూర్తి ఒకరు. ఈమె ఆరంభంలోనే హౌస్లో అడుగుపెట్టాల్సింది. సరిగ్గా చివరి నిమిషంలో విషాదం చోటు చేసుకుంది. పూజ మూర్తి హఠాన్మరణం పొందాడు. దాంతో పూజ మూర్తి ఆగిపోయింది. బిగ్ బాస్ షోకి వెళ్లడం చనిపోయిన తండ్రి కోరికట. పూజ హౌస్లోకి వెళుతుందని తెలిసిన పూజ తండ్రి ఆమెకు జాగ్రత్తలు చెప్పాడట. హౌస్లో నిన్ను చూడాలని ఉందన్నారట. బిగ్ బాస్ షోకి ఇలాంటి పరిస్థితులలో రావడానికి అసలు కారణం అది అని చెప్పింది.
ఈ రెండు వారాలు పూజ గేమ్ స్మూత్ గా సాగింది. బొద్దుగా ఉండే పూజను టీమ్ సభ్యులు ఫిజికల్ టాస్క్ లలో ఎంకరేజ్ చేయలేదు. ఆమెకు ఆడే ఛాన్స్ ఇవ్వలేదు. అలాగే పూజ చాలా వరకు వివాదాలకు దూరంగా ఉంది. అయినప్పటికీ అనేక సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకుల్లో ఫేమ్ తెచ్చుకున్న పూజ ఇంత త్వరగా ఎలిమినేట్ కావడం ఊహించని పరిణామం.
పూజ ఎలిమినేట్ అయిన క్రమంలో ఆమె రెమ్యూనరేషన్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. సోషల్ మీడియా ప్రచారం ప్రకారం పూజ వారానికి రూ. 2 లక్షల రెమ్యూనరేషన్ ఒప్పందం పై హౌస్లో అడుగుపెట్టిందట. రెండు వారాలు ఉన్న పూజకు రూ. 4 లక్షల రెమ్యూనరేషన్ దక్కిందట. అయితే ఇది యావర్ రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ అంటున్నారు. ప్రిన్స్ యావర్ కి నిర్వాహకులు కేవలం లక్ష రూపాయలు వారానికి ఇస్తున్నారట.
పూజతో కలిపి మొత్తం 7మంది అమ్మాయిలు వరుసగా బిగ్ బాస్ ఇంటిని వీడారు. కాగా వీరి నుండి రతిక రోజ్ రీఎంట్రీ ఇచ్చింది. దామని, శుభశ్రీ, రతిక రోజ్ లలో ఒకరు హౌస్లోకి తిరిగి రావాల్సి ఉంది. అది ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ డిసైడ్ చేయాలని ఓటింగ్ నిర్వహించారు. అనూహ్యంగా ఓటింగ్ అనంతరం తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకు ఛాన్స్ అని చెప్పి హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చాడు నాగార్జున.ఆ విధంగా హౌస్ మేట్స్ తిరస్కరించిన రతిక రోజ్ కి ఛాన్స్ దక్కింది...