Bigg Boss Telugu 7: యూ ఆర్ ఎలిమినేటెడ్ అన్న నాగార్జున... షాక్ లో కంటెస్టెంట్స్!
బిగ్ బాస్ తెలుగు 7 ఫస్ట్ ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. ఆదివారం నాగార్జున ఒక కంటెస్టెంట్ ని ఇంటికి పంపనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఆసక్తిరేపుతోంది.

14 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు 7 (Bigg Boss Telugu 7)సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. వీరిలో నేడు ఒకరు ఎలిమినేట్ కానున్నారు. నాగార్జున నేతృత్వంలో ఆదివారం ఎపిసోడ్ సరదాగా సాగింది. చివర్లో మాత్రం ఎలిమినేషన్ బాంబ్ పేల్చాడు. మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని కొందరు భావించారు. అయితే లేటెస్ట్ ప్రోమోతో క్లారిటీ వచ్చేసింది.
రతికా రోజ్, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, దామిని, కిరణ్ రాథోడ్, షకీలా, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. అనూహ్యంగా ఓటింగ్ లో 40% ఓట్లు ఒక్క కంటెస్టెంట్ కే పడ్డాయని సమాచారం. అది కూడా కామనర్ హోదాలో హౌస్లో అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి. పల్లవి ప్రశాంత్ గురించి ఎవరికీ తెలియదు. అతడు సెలెబ్రిటీ కూడా కాదు. అయినా ప్రేక్షకులు అతడిపై ప్రేమ కుమ్మరిస్తున్నారు.
పల్లవి ప్రశాంత్ తర్వాత రెండో స్థానంలో రతికా రోజ్ ఉందట. శోభా శెట్టి మూడో స్థానం, గౌతమ్ కృష్ణ నాలుగో స్థానంలో ఉన్నారట. షకీలా, ప్రిన్స్ యావర్ ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారట. ఇక దామిని ఏడవ స్థానంలో, కిరణ్ రాథోడ్ ఎనిమిదవ స్థానంలో ఉన్నారట. కాబట్టి ఓటింగ్ సరళి ప్రకారం ఈ ఆదివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యిందని అంటున్నారు. నాగార్జున ప్రోమోలో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. ఆ కంటెస్టెంట్ ఎవరనేది ప్రోమోలో చూపించలేదు. అది కిరణ్ రాథోడ్ కావచ్చని తెలుస్తుంది. పీపుల్ పల్స్ లో కూడా అందరికంటే కిరణ్ రాథోడ్ కి తక్కువ మార్క్స్ పడ్డాయి. ఆమెకు ఆడియన్స్ కేవలం 50 మార్క్స్ వేశారు.
ఎవరు ఎలిమినేట్ అయినా హౌస్లో ఉండేది కేవలం 13 మంది. కాగా మరో 8 మంది కంటెస్టెంట్స్ వరకూ హౌస్లోకి వెళుతున్నారని సమాచారం. సీరియల్ నటి పూజా మూర్తి, హీరోయిన్ ఫర్జానాతో పాటు కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. మరి వారిని ఎప్పుడు హౌస్లో ప్రవేశపెడతారు అనేది చూడాలి...