Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: ఇదేం ట్విస్ట్.. ఈ వారం తీసేసి వచ్చే వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. లాజిక్‌ లెస్‌.. ?

ఈ వారం ఎలిమినేషన్‌ లేకపోవడానికి కారణం ఏంటో చెప్పారు హోస్ట్ నాగార్జున.  ఫ్రీ ఎవిక్షన్‌ పాస్‌ని వెనక్కి ఇవ్వడం కారణంగా ఎలిమినేషన్‌ ని బిగ్‌ బాస్‌ ఎత్తేశాడని తెలిపింది. 

bigg boss telugu 7 big twist no elimination this week but double elimination to next week arj
Author
First Published Nov 19, 2023, 11:08 PM IST | Last Updated Nov 19, 2023, 11:08 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7 పదకొండో వారంలో ఊహించినట్టుగానే, ప్రచారం జరుగుతున్నట్టుగానే ఎలిమినేషన్‌ లేకుండా చేశారు. ఈ వారం నో ఎలిమినేషన్‌ గా ప్రకటించారు. ప్రీ ఎవిక్షన్‌ పాస్‌ కారణంగా ఈ వారం ఎలిమినేషన్‌ లేదని నాగ్‌ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వారం నామినేషన్‌లో అర్జున్‌, శోభాశెట్టి, అమర్‌, యావర్‌, రతిక, అశ్విని, గౌతమ్‌ ఉన్నారు. ఇందులో అంతా సేవ్‌ అయ్యారు. చివరికి అశ్విని, గౌతమ్‌ మిగిలారు. వారిలో ఎవరు ఎలిమినేట్‌ అనేది నిర్ణయించే సమయం వచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎలిమినేషన్‌లో ఇద్దరు సేవ్‌ అయినట్టు రిజల్ట్ చూపించారు. దీంతో అంతా హ్యాపీ అయ్యారు. 

అయితే ఈ వారం ఎలిమినేషన్‌ లేకపోవడానికి కారణం ఏంటో చెప్పారు హోస్ట్ నాగార్జున. యావర్‌ ఫ్రీ ఎవిక్షన్‌ పాస్‌ని వెనక్కి ఇవ్వడం కారణంగా ఎలిమినేషన్‌ ని బిగ్‌ బాస్‌ ఎత్తేశాడని తెలిపింది. మరోసారి ప్రీ ఎవిక్షన్‌ పాస్‌ని పొందే అవకాశాన్ని బిగ్‌ బాస్‌ కల్పిస్తున్నారని తెలిపింది. అయితే యావర్‌ ఎవిక్షన్‌ పాస్‌ని వెనక్కి ఇవ్వడానికి, ఎలిమినేషన్‌ని ఎత్తేయడానికి సంబంధం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదంతా లాజిక్ లెస్‌ అని, ఎవరినో కాపాడటం కోసం ఇదంతా చేశారనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ వారం సైతం బిగ్‌ బాస్‌ విమర్శలపాలవుతున్నారు. గత రెండు వారాల ఎలిమినేషన్‌లోనూ విమర్శలు వచ్చాయి. ఎంటర్‌టైన్‌ చేసే తేజ, భోలేలను పంపించి పప్పు బ్యాచ్‌ని హౌజ్‌లో ఉంచారనే కామెంట్లు వచ్చాయి. తాజాగా నాగ్‌ చేసింది కూడా విమర్శలకు తావిస్తుంది. 

అయితే ఈ వారం కూడా ప్రీ ఎవిక్షన్‌ పాస్‌ సంపాదించుకునే అవకాశాన్ని బిగ్‌ బాస్‌ కల్పిస్తున్నాని చెప్పిన నాగ్‌.. వచ్చే వారానికి సంబంధించిన ట్విస్ట్ ఇచ్చారు. వచ్చే వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని వెల్లడించారు. ఈ సీజన్‌ షో ఉల్లా పుల్టా అనేది చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నట్టు చెప్పారు. వచ్చే వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని చెప్పారు నాగ్‌. 

ఇక ప్రస్తుతం హౌజ్‌లో శివాజీ, అర్జున్‌, అమర్‌ దీప్‌, శోభా శెట్టి, ప్రియాంక, అశ్విని, యావర్‌, పల్లవి ప్రశాంత్‌, రతిక, గౌతమ్‌ ఇలా పది మంది హౌజ్‌లో ఉన్నారు. ఈ వారం గౌతమ్‌, అశ్వినిలో ఒకరు సేవ్‌ అయ్యారు. మరి వచ్చే వారం ఏ ఇద్దరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక బిగ్‌ బాస్‌ షో పదకొండు వారాలు పూర్తి చేసుకుంది. మరో నాలుగు వారాలు మాత్రమే ఉంది. వచ్చే వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుంది. మరి టాప్‌ 5లో ఉండేది ఎవరు? టాప్‌ 7లో ఎవరుంటారనేది త్వరలో తేలనుంది. 

ఇక ఆదివారం షోలో హౌజ్‌మేట్స్ కి ఫ్రెండ్‌ని చేసుకునేది ఎవర్ని, బ్లాక్‌ చేసేది ఎవర్నీ అనే టాస్క్ ఇచ్చాడు నాగ్‌. ఇందులో ప్రశాంత్‌ని ఫ్రెండ్‌ని చేసుకుంటా అని, శోభాని బ్లాక్‌ చేస్తానని తెలిపారు. అమర్‌.. ప్రశాంత్‌ని ఫ్రెండ్‌ చేసుకుంటా అని, రతికని బ్లాక్‌ చేస్తా అన్నారు, రతిక యావర్‌ని ఫ్రెండ్‌గా, అమర్‌ని బ్లాక్‌ చేస్తానని చెప్పింది. శోభా శెట్టి రతికని ఫ్రెండ్‌గా, గౌతమ్‌ని బ్లాక్ చేస్తానని, అశ్విని.. శోభాని ఫ్రెండ్‌గా, గౌతమ్‌ని బ్లాక్ చేస్తానని వెల్లడించింది. యావర్‌.. శోభాని ఫ్రెండ్‌గా, గౌతమ్‌ని బ్లాక్‌ అని, ప్రశాంత్‌.. అమర్‌ని ఫ్రెండ్గా, గౌతమ్‌ బ్లాక్‌గా, అర్జున్‌.. శివాజీని ఫ్రెండ్‌గా, యావర్‌ని బ్లాక్‌గా, శివాజీ.. అర్జున్‌ని ఫ్రెండ్‌గా, రతికని బ్లాక్‌ చేస్తానని, ప్రియాంక.. ప్రశాంత్‌ని ఫ్రెండ్‌గా, రతికని బ్లాక్‌ చేస్తానని చెప్పారు. ఇలా ప్రశాంత్‌ని ఫ్రెండ్‌గా చేసుకునేందుకు, గౌతమ్‌ని బ్లాక్‌ చేసేందుకు మెజారిటీ అభిప్రాయాలను వెల్లడించారు. 

మరోవైపు సండే ఫండేలో పాటలను ఊహించి వాటికి డాన్సులు వేయించారు నాగ్‌. మరోవైపు షోలో `కోటబొమ్మాళి` టీమ్‌ సందడి చేసింది. శ్రీకాంత్‌, శివానీ రాజశేఖర్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, రాహుల్‌ విజయ్ వచ్చి సందడి చేశారు. తమ సినిమా విశేషాలను పంచుకున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios