Bigg Boss Telugu 7: మాది మిడిల్ క్లాస్, టార్గెట్ చేయకండి... అమర్ దీప్ తల్లి ఎమోషనల్ కామెంట్స్
టాప్ సెలబ్ హోదాలో హౌస్లో అడుగుపెట్టిన అమర్ దీప్ తేలిపోయిన విషయం తెలిసిందే. చెప్పాలంటే అతడు టైటిల్ రేసులో కూడా లేడు. కాగా తన కొడుకుపై నెగిటివ్ కామెంట్స్ చేయకండి అంటూ అమర్ తల్లి రిక్వెస్ట్ చేశారు.

సీరియల్ నటుడు అమర్ దీప్ కి బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 టాప్ సెలెబ్స్ లో అమర్ దీప్ ఒకడు అనడంలో సందేహం లేదు. టైటిల్ ఫేవరెట్ గా అతడు ప్రచారం అయ్యాడు. అయితే గేమ్ అంచనాలకు తగ్గట్లు ఆడటం లేదు. రోజులు గడిచే కొద్దీ అతడి గ్రాఫ్ పడిపోతుంది. దాదాపు ఆరు వారాలు పూర్తి అవుతుండగా ఒక్క సరైన విజయం నమోదు చేయలేదు. అనవసరమైన ఫ్రస్ట్రేషన్, దారుణమైన అమాయకత్వం తప్పితే విషయం లేదు.
పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేయడం ద్వారా హైలెట్ కావాలని అమర్ దీప్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇక నాగార్జున కూడా అమర్ దీప్ గేమ్ పై పెదవి విరిచాడు. కనీసం గేమ్ అర్థం కావడం లేదన్నాడు. కొత్తగా హౌస్లో అడుగుపెట్టిన వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా అమర్ నే టార్గెట్ చేశారు. నామినేషన్స్ లో ఏకి పారేశారు. దీనికి తోడు సోషల్ మీడియాలో అమర్ పై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది.
దీంతో అమర్ దీప్ తల్లి హర్ట్ అయ్యారు. ఆమె ఓ ఎమోషనల్ వీడియో విడుదల చేశారు. అమర్ దీప్ ని సోషల్ మీడియాలో చాలా బ్యాడ్ చేసి మాట్లాడుతున్నారు. దయచేసి అది ఆపేయండి. అమర్ దీప్ మంచి నటుడు, డాన్సర్. కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. రైతు గురించి ఎవరూ తప్పుగా మాట్లాడరు. నేను కూడా రైతు బిడ్డనే. అమర్ దీప్ తండ్రి ఒక మెకానిక్. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎవరూ పెద్ద స్థాయిలో లేరు. అమర్ దీప్ కి పొగరు అంటున్నారు. అది నిజం కాదు. తాను చాలా మంచివాడు. దయచేసి సపోర్ట్ చేయండి, అన్నారు.