నామినేషన్స్ డే హౌస్లో ఆటోమేటిక్ గా హీట్ పెరిగింది. కంటెస్టెంట్స్  నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. ఇనయా బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా ప్రకటించుకుంది.  

బిగ్ బాస్ సీజన్ 6 సగం ముగిసింది. ఎనిమిది వారాలు పూర్తి కాగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఈ ఆదివారం కంటెస్టెంట్ సూర్య ఎలిమినేటై ఇంటికి వెళ్ళిపోయాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న సూర్య ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. అతడు ఒకసారి కెప్టెన్ అయ్యాడు. మరోసారి కంటెండర్ గా కెప్టెన్సీకి పోటీ పడ్డాడు. గేమ్స్, టాస్క్స్ పరంగా బాగా ఆడతాడనే పేరుంది. అయితే ప్రేమ వ్యవహారాలు అతడిపై నెగిటివ్ ప్రభావం చూపాయి. 

సూర్య ఎలిమినేషన్ తో హౌస్లో 13 మంది మిగిలారు. వీరిలో ఒకరు వచ్చే వారం హౌస్ వీడనున్నారు. నేడు సోమవారం కావడంతో బిగ్ బాస్ ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. గార్డెన్ ఏరియాలో ఉన్న దిష్టి బొమ్మలపై కంటెస్టెంట్స్ ఫోటోలు అతికించి ఉన్నాయి. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని కారణాలు చెప్పి నామినేట్ చేయాలి. నామినేట్ చేయనున్న కంటెస్టెంట్ ఫోటో ఉన్న బొమ్మకు కుండ తలగా తగిలించి దాన్ని బద్దలు కొట్టాలి. 

ఈ నామినేషన్స్ లో రేవంత్, ఇనయా మధ్య వాడి వేడి వాగ్వాదం నడించింది. అలాగే ఇనయా తనను నామినేట్ చేసిన మరో కంటెస్టెంట్ ఆదిరెడ్డిపై విరుచుకు పడింది. ఈ సంబాషణలో ఇనయా తనని తాను బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా ప్రకటించుకుంది. దానికి ఆది రెడ్డి, శ్రీహాన్ నవ్వారు. అలాగే గీతూ... రోహిత్, మెరీనాలను నామినేట్ చేసింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉంది ఎవరని తెలియాలంటే... ఎపిసోడ్ చూడాలి. విడుదలైన ప్రోమోలో ఈ ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.