సూర్య ఎలిమినేటై బిగ్ బాస్ వేదికపైకి వెళ్లారు. ఆయన హోస్ట్ నాగార్జునతో జాయిన్ అయ్యాడు. ఇక మన టీవీ లోనుండి ఇనయా ప్రేమ సైగలతో రెచ్చిపోయింది. పబ్లిక్ లో సూర్య-ఇనయా తీరు చూసి హోస్ట్ నాగార్జునకు కూడా మైండ్ బ్లాక్ అయ్యింది.
బిగ్ బాస్ హౌస్ ఇనయా కన్నీళ్లతో మునిగిపోయింది. ప్రేమికుడు సూర్య దూరం అవుతున్నాడని తట్టుకోలేక ఆమె కన్నీటి పర్యంతమైంది. సూర్యను ఇనయా గట్టిగా కౌగిలించుకుని ఆవేదన చెందింది. చివరికి బిగ్ బాస్ హౌస్ మెయిన్ గేటు వద్ద కూలబడిపోయింది. డోర్ అవతలి నుండి సూర్య మాట్లాడతాడేమోనని ఆశపడింది. ఇనయాను చూస్తే ఒక లైలా, పార్వతి, అనార్కలి గుర్తుకు వచ్చారు. అసలు సూర్య తనకు శాశ్వతంగా దూరం అవుతున్నట్లు గుండెలు పగిలేలా ఏడ్చింది.
బిగ్ బాస్ చరిత్రలో ఈ రేంజ్ ఎమోషనల్ లవ్ సీన్ చూడలేదు. ఇనయా కొంచెం ఓవర్ చేశారని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరి రొమాన్స్, ఎమోషన్ అక్కడితో ఆగలేదు. ఎలిమినేటైన సూర్య హోస్ట్ నాగార్జునతో జాయిన్ అయ్యారు. మన టీవీలో ఇనయాను చూస్తూ సూర్య మైమరచిపోయాడు. ఇక ఇనయా అయితే ముసి ముసి నవ్వులు నవ్వుతూ సైగలు మొదలుపెట్టింది. ఇనయా సైగలకు సూర్య రెస్పాండ్ అయ్యాడు. వేదికపై నుండి అతడు కూడా ఆమెకు లవ్ సిగ్నల్స్ ఇచ్చాడు .
ఇదంతా గమనిస్తున్న హోస్ట్ నాగార్జున మైండ్ పోయింది. ప్రేమ ఎక్కువైతే ఇలాంటి సైగలు చేసుకుంటారా? నాకేమీ అర్థం కావడం లేదంటూ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇనయా తన లవర్ సూర్యకు ఇచ్చిన రొమాంటిక్ సెండాఫ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే సూర్య హౌస్లో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ ఆరోహిరావుతో సన్నిహితంగా ఉన్నాడు. ఆమె ఎలిమినేట్ అయ్యాక ఇనయాకు దగ్గరయ్యాడు.
ఇనయా ఓపెన్ గా సూర్యపై ఇష్టాన్ని బయటపెట్టింది. దీంతో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. సూర్య మోజులో పడి ఇనయా గేమ్ ఆడటం లేదన్న ఆరోపణలు ఎక్కువ కావడంతో ఇద్దరూ ఒక ఒప్పందం మీద కొంచెం డిస్టెన్స్ మైంటైన్ చేశారు. మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ మధ్య వాసంతిని కూడా గెలికే ప్రయత్నం చేశాడు సూర్య. ఆమెతో పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు. ఇంతలోనే ఎలిమినేట్ కావడం జరిగింది.
