ఆదివారం ఎలిమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. పది మంది నామినేట్ కాగా తక్కువ ఓట్లతో గీతూ, శ్రీసత్య డేంజర్ జోన్లోకి వచ్చారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది.
బిగ్ బాస్ సీజన్ 6 సక్సెస్ ఫుల్ గా 8వ వారం పూర్తి చేసుకుంది. ఇక వీకెండ్ వచ్చేయగా ఒకరు హౌస్ వీడాల్సి ఉంది. ఈ వారానికి మొత్తం 10 మంది నామినేట్ అయ్యారు. హౌస్లో మొత్తం 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో శ్రీహాన్, రాజ్, స్రవంతి మాత్రమే నామినేట్ కాలేదు మిగతా కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. శనివారం ఎపిసోడ్లో ఆదిరెడ్డి, కీర్తి, రేవంత్ సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. మిగిలిన ఏడుగురు సభ్యుల్లో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది.
కాగా మిగతా కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారు. ఫైనల్ గా గీతూ, శ్రీసత్య మిగిలారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నట్లు నాగార్జున తెలియజేశాడు. వారి ఫోటోలు ఉన్న గ్లాస్ బౌల్స్ ముందు పెట్టాడు. ఆ బౌల్ లో చేతిలో ఉన్న బాటిల్ లో ఉన్న లిక్విడ్ పోయాలని నాగార్జున చెప్పారు. ఆ లిక్విడ్ కలర్స్ ఆధారంగా ఒకరు సేవ్ మరొకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పారు.
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాలి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం గీతూని ఎలిమినేట్ చేశారు అంటున్నారు. అదే సమయంలో ఆమెను బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్ కి పంపారన్న ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. గత వారం సూర్య ఎలిమినేటైన విషయం తెలిసిందే.
