11వ వారానికి గాను కెప్టెన్ గా ఇనయా అవతరించింది. 'వస్తా నీ వెనుక' గేమ్ లో గెలిచిన ఫైమా కెప్టెన్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. ఇక వరస్ట్ పెర్ఫార్మర్ గా మెజారిటీ ఇంటి సభ్యులు ఇనయాకు ఓటు వేయడంతో ఆమె జైలుకు వెళ్లారు.
ఈ వారానికి బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా ఫైమా ఎంపికైంది. కెప్టెన్ ఎంపిక కోసం 'వస్తా నీ వెనుక' గేమ్ కండక్ట్ చేసారు. ఫైనల్ కి చేరిన రోహిత్, మెరీనా, ఆది రెడ్డి, కీర్తి, ఫైమా, శ్రీసత్య ఈ గేమ్ లో పోటీ పడ్డారు. రోహిత్, మెరీనా, కీర్తి ఎలిమినేట్ కాగా ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్య మిగిలారు. ఈ ముగ్గురు నింపి ఉన్న బస్తాలు వీపున తగిలించుకొని సర్కిల్ లో తిరగాలి. తమ బస్తా ఖాళీ కాకుండా కాపాడుకోవడంతో పాటు ఇతరుల బస్తా ఖాళీ చేయాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడు తక్కువ బరువు ఉన్న బస్తా కలిగిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు.
ఈ గేమ్ లో ఆదిరెడ్డి శ్రీసత్య బస్తా ఖాళీ చేసే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో తన బస్తానే ఖాళీ అయ్యింది. దీంతో ఆదిరెడ్డి ఎలిమినేట్ కాగా... శ్రీసత్య, ఫైమా ఫైనల్ లో పోటీపడ్డారు. బజర్ మోగే సమయానికి ఫైమా బస్తా ఎక్కువ బరువు కలిగి ఉండగా ఆమె గెలిచినట్లు సంచాలక్ రేవంత్ ప్రకటించాడు. దీంతో ఆమె హౌస్ కొత్త కెప్టెన్ గా అవతరించింది. అయితే ఈ గేమ్ లో ఆదిరెడ్డి ఫైమాకు ఫేవర్ చేశాడన్న అభిప్రాయం వెల్లడైంది.
ఈ విషయంలో ఆదిరెడ్డి, ఇనయా మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే ఫైమా-ఇనయా కూడా తీవ్రస్థాయిలో వాదులాడుకున్నారు. అనంతరం ఇనయా కెప్టెన్ బాధ్యతలు స్వీకరించింది. ఇక ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. అత్యధికంగా ముగ్గురు ఇంటి సభ్యులు ఇనయాను వరస్ట్ పెరఫార్మర్ గా నామినేట్ చేశారు. దీంతో ఆమె జైలుకు వెళ్లారు. కెప్టెన్ ఫైమా ఇనయాను జైలులో పెట్టి తాళం వేసింది. ఆ విధంగా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.
ఇక మరో వీకెండ్ వచ్చేయగా నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ వారం జరిగిన గేమ్, కంటెస్టెంట్స్ ఆట తీరు మాట తీరుపై రివ్యూ నిర్వహించనున్నారు. అలాగే తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. గతవారం గీతూ ఎలిమినేట్ కాగా ఈ వారం ఇంటిని వీడేది ఎవరో చూడాలి.
