బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసిన ఆదిరెడ్డి,గీతూ శిక్షకు గురయ్యారు. ఆ శిక్షను అనుభవించలేక ఆపసోపాలు పడ్డారు. ఆదిరెడ్డి అయితే ఇది టార్చర్ అంటూ బయటపడ్డాడు.
బిగ్ బాస్ ఇంటిలో కంటెస్టెంట్స్ టఫ్ కండిషన్స్ ఎదుర్కొంటున్నారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఇంటి సభ్యులు ఫెయిల్ కాగా బిగ్ బాస్ ఏకంగా టాస్క్ రద్దు చేశాడు. దానికి శిక్షగా కంటెస్టెంట్స్ ని ఆకలి బాధకు గురి చేశారు. ఇంట్లో ఉన్న ఆహారం మొత్తం బిగ్ బాస్ స్టోర్ రూమ్ లో పెట్టించాడు. కిచెన్ లో తినడానికి ఒక్క ఐటెం కూడా లేకుండా చేశాడు. మార్నింగ్ నుండి ఏమీ తినని కంటెస్టెంట్స్ నీరసించి పోయారు. ఎక్కడివారక్కడ కూలబడిపోయారు. ఆహారం కావాలంటే పోరాడాలి, ఇకపై కష్టపడి సాధించుకొని తినాలని బిగ్ బాస్ సూచించాడు.
దీనిలో భాగంగా ఇంటి సభ్యులను టీమ్స్ గా విభజించి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. గేమ్ లో గెలిచిన సభ్యులకు మాత్రమే ఆహారం దక్కేలా రూల్స్ పెట్టాడు. ఫస్ట్ కబడ్డీ పెట్టారు. అనంతరం రివర్స్ టగ్ ఆఫ్ వార్ పెట్టడం జరిగింది. కాగా గీతూ, ఆదిరెడ్డి నిబంధనలు ఉల్లంఘించారు. గెలిచిన ఇంటి సభ్యులు తమ ఆహారాన్ని ఇతర కంటెస్టెంట్స్ తో పంచుకోకూడని రూల్ పెట్టారు. కానీ ఆదిరెడ్డి తన ఫ్రెండ్ గీతూతో షేర్ చేసుకున్నాడు.
గెలిచిన టీంలో ఉన్న ఆదిరెడ్డి ఓడిన టీమ్ లో ఉన్న గీతూకి ఫుడ్ పెట్టడంతో బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు. ఆదిరెడ్డితో పాటు గీతూకి శిక్ష విధించాడు. ఇద్దరి చేత పాత్రలు కడిగించాడు. పాత్రలు శుభ్రం చేసిన అనంతరం గీతూ, ఆదిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నడూ పాత్రలు కడగలేదన్న ఆది రెడ్డి ఇది టార్చర్ అన్నాడు. ఇక గీతూ అయితే మా ఇంట్లో తిన్నాక చేయి కడుక్కోవడానికి కూడా నీళ్లు తెస్తారంటూ బిల్డప్ ఇచ్చింది.
గేమ్ సరిగా ఆడటం లేదని కసిగా ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తున్నాడు. ఇక ఈ వారం హోస్ట్ నాగార్జున కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గేమ్ సరిగా ఆడని కంటెస్టెంట్స్ కి ఆయన క్లాస్ పీకడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో నెక్స్ట్ వీకెండ్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.
