తొమ్మిదో వారం ఎలిమినేటైన గీతూ రీఎంట్రీ ఇవ్వనుందా? ఆమెను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలికి పంపనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గీతూ బిగ్ బాస్ షోలో మరలా కనిపించనున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది.  

గీతూ ఎలిమినేషన్ అందరి గుండెలు బరువెక్కేలా చేసింది. గీతూ ఏడుస్తూ తీవ్ర స్థాయిలో ఆవేదన చెందింది. అసలు ఏమాత్రం ఊహించలేదన్న ఆమె నేను వెళ్ళను సార్ అని మొండికేసింది. నాగార్జున ఎంత ఓదార్చినా ఆమె సెటిల్ కాలేదు. గీతూ ఆవేదన ఆమె మాటల్లో విన్న కంటెస్టెంట్స్ కి సైతం కన్నీళ్లు వచ్చాయి. అప్పటి వరకు తిట్టుకున్న కంటెస్టెంట్స్, ఆడియన్స్ గీతూ ఎలిమినేట్ కాకుండా ఉండాల్సిందని భావించారు. నిజంగా ఆమెను వెనక్కి పంపిస్తే బాగుండు అనుకున్నారు. 

గీతూ చేసిన కొన్ని తప్పులు ఆమెపై భయంకరమైన నెగిటివిటీ తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేయడం ఎక్కువైంది. గీతూ ఏం చేసినా ఆటలో భాగంగానే చేసింది. అయితే ఆమె చర్యలు ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించాయి. గీతూని ఎలిమినేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేశారు. టైటిల్ ఫేవరేట్ గా ఉన్న గీతూ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. 

అయితే గీతూ ఎలిమినేషన్ బిగ్ బాస్ షోకి కూడా ఇబ్బంది కలిగించే అంశమే. తాను గేమ్ ఆడుతూ నలుగురితో గేమ్ ఆడించే గీతూ ఎలిమినేట్ కావడంతో హౌస్లో పోటీ వాతావరణం కనిపించకపోవచ్చు. ఈ క్రమంలో బిగ్ బాస్ నిర్వాహకులు సెకండ్ ఆప్షన్ గా ఆమెను వైల్డ్ కార్డు ఎంట్రీతో లోపలికి పంపే ఆలోచనలో ఉన్నారట.రెండు మూడు వారాలు హౌస్ మేట్స్ ఆటతీరు, రేటింగ్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారట. 

ఈ క్రమంలో గీతూ రీఎంట్రీ దాదాపు ఖాయమే అనేది మెజారిటీ ప్రేక్షకుల అంచనా. అయితే కొన్ని కండీషన్స్ అప్లై అవుతాయి. ఆమె టైటిల్ విన్నర్ కాలేరు. ఒకసారి బయకు వచ్చి తిరిగి హౌస్లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ కి ఆ అవకాశం ఉండదు. టాప్ 5 కంటెస్టెంట్ గా ఫైనల్ వరకూ వెళ్లే ఛాన్స్ ఉంటుంది.గతంలో అలీ రెజా ఎలిమినేటై మరల వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్లోకి వెళ్ళాడు. ఫైనల్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచాడు. మరి ఈ అంచనా ఎంత వరకు నిజం అవుతుందో తెలియదు కానీ... గీతూ రాయల్ మరలా షోకి వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అదే సమయంలో తప్పులు తెలుసుకున్న గీతూ గేమ్ ఎలా ఉంటుందో చూడాలనే ఆత్రుత ప్రేక్షకుల్లో కలుగుతుంది.