బిగ్ బాస్ కంటెస్టెంట్ బాల ఆదిత్యను చీట్ చేశాడు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి బ్యాటరీ ఖర్చు చేసేలా చేశాడు. ఈ కారణంగా మరో కంటెస్టెంట్ బలికావాల్సి వచ్చింది.
ప్రస్తుతం హౌస్ లో బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తుంది.కంటెస్టెంట్స్ కుటుంబాలను వదిలి నెల రోజులు దాటిపోగా వాళ్లలోని ఎమోషన్స్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడాలనే ఆశ రేపి కంటెస్టెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. బ్యాటరీ రీఛార్జ్ గేమ్ లో కంటెస్టెంట్స్... బ్యాటరీ ఛార్జ్ సేవ్ చేయాలి. ప్రతి కంటెస్టెంట్ కి మూడు ఆప్షన్స్ ఇస్తారు. రెండు ఆప్షన్స్ కుటుంబ సభ్యలతో వీడియో కాల్, ఆడియో కాల్ ఉంటాయి. మూడో ఆప్షన్ అంతగా ప్రాధాన్యత లేని ఫుడ్ లాంటిది ఉంటుంది.
కుటుంబ సభ్యులతో మాట్లాడే ఆప్షన్స్ కి అధిక శాతం బ్యాటరీ పర్సంటేజ్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే బ్యాటరీ డౌన్ అవుతుంది. బ్యాటరీ పూర్తిగా డౌన్ అయితే గేమ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉండదు. గేమ్ రూల్స్ ఇవి కాగా... బాల ఆదిత్య వంతు వచ్చింది. కన్ఫెషన్ రూమ్ లోకి బిగ్ బాస్ పిలిచాడు.
బ్యాటరీ 50 శాతం మాత్రమే మిగిలి ఉంది. బాల ఆదిత్యకు బిగ్ బాస్ మూడు ఆప్షన్స్ ఇచ్చాడు. భార్యతో ఆడియో కాల్, ఆడియో మెసేజ్, ఫుడ్ ఆప్షన్ ఇచ్చారు. ఆడియో కాల్ మాట్లాడాలంటే అత్యధికంగా 50 శాతం బ్యాటరీ వాడాలని చెప్పాడు. బాల ఆదిత్య ఆడియో కాల్ ఆప్షన్ తీసుకుంటే బ్యాటరీ జీరో అవుతుంది. గేమ్ ఎండ్ అవుతుంది. ఏం చేయాలా అని సందిగ్ధంలో ఉండగా... బిగ్ బాస్ చెప్పిన ఒక మాట బాల ఆదిత్యను టెంప్ట్ చేసింది. బాల ఆదిత్య హౌస్లోకి వచ్చినప్పుడు పుట్టిన రెండో కూతురికి ఏం పేరు పెట్టారో తెలుసుకోవాలని ఉందా? అన్నాడు.
ఆ మాటతో బాల ఆదిత్య ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి గురయ్యాడు. మిగతా కంటెస్టెంట్స్ గురించి ఆలోచించకుండా 50 శాతం బ్యాటరీ వాడి భార్యతో మాట్లాడే ఆప్షన్ ఎంచుకున్నాడు. తీరా వైఫ్ తో ఫోన్ లో మాట్లాడాక తెలిసిన విషయం ఏమిటంటే రెండో కూతురికి ఇంకా పేరు పెట్టలేదు. మీరు వచ్చాక పెడదామని ఆగామని బాల ఆదిత్య భార్య చెప్పారు. కూతురికి పేరు పెట్టేశారు, అదేమిటో తెలుసుకో అని చెప్పి బిగ్ బాస్ బాల ఆదిత్యను చీట్ చేశాడు.
లేదంటే బాల ఆదిత్య మరో ఆప్షన్ ఎంచుకునేవాడు. తను బ్యాటరీ జీరో చేయడంతో గేమ్ ఎండ్ అయ్యింది. అయితే ఈ వారం నామినేషన్స్ లో లేని రోహిత్, వాసంతిలో ఒకరు రెండు వారాలు నేరుగా నామినేట్ అవుతామని అంగీకరిస్తే బ్యాటరీ వంద శాతం ఛార్జ్ చేస్తానని బిగ్ బాస్ హామీ ఇచ్చాడు. ఆ ఆఫర్ తీసుకొని ఇంటి సభ్యుల కోసం రోహిత్ నేరుగా రెండు వారాలు నామినేట్ అయ్యాడు. బాల ఆదిత్య నిర్ణయం రోహిత్ ని ఎఫెక్ట్ చేసింది.
