Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 6: 10 వారాలు హౌస్లో ఉన్న బాల ఆదిత్య ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే?


రెండు వారాలుగా షాకింగ్ ఎలిమినేషన్స్ చోటు చేసుకుంటున్నాయి. గీతూ, బాల ఆదిత్య ఇంత త్వరగా హౌస్ వీడుతారని ఎవరూ ఊహించలేదు. కారణం ఏదైనా ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ హౌస్ వీడారు. కాగా హౌస్లో పది వారాలున్న బాల ఆదిత్య ఎంత తీసుకున్నాడన్న సమాచారం బయటకు వచ్చింది. 
 

bigg boss telugu 6 contestant bala aditya 10 weeks remuneration leaked
Author
First Published Nov 14, 2022, 8:03 PM IST


బిగ్ బాస్ సీజన్ 6 టాప్ సెలెబ్రిటీస్ లో బాల ఆదిత్య ఒకరు. బాల నటుడిగా, హీరోగా ఆయన ప్రేక్షకులకు సుపరిచితుడు. రేవంత్, ఫైమా, కీర్తి, మెరీనా కంటే కూడా బాల ఆదిత్య ఫేమస్. కాలం కలిసొస్తే మంచి హీరో అయ్యేవాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ స్టార్ అయిన బాల ఆదిత్య హీరోగా సక్సెస్ కాలేకపోయారు. బిగ్ బాస్ హౌస్లో బాల ఆదిత్య ఎవరికీ తెలియని తన వ్యక్తిత్వం ఏమిటో ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఎమోషన్స్ కోల్పోకుండా సమయస్ఫూర్తితో, సహనంగా మాట్లాడటం బాల ఆదిత్యను చూసి నేర్చుకోవాలి. 

మంచితనం ఎక్కువైందని నాగార్జున కంప్లైంట్ చేసినప్పటికీ.. బాల ఆదిత్య చాలా మందికి నచ్చారు. గేమ్స్, టాస్క్స్ లో బాల ఆదిత్య ఫుల్ ఎఫ్ఫార్ట్స్ పెట్టి ఆడారు. బిగ్ బాస్ హౌస్ సంచలనాలకు మారు పేరు. అక్కడ ఏదైనా జరగొచ్చు కాబట్టి, బాల ఆదిత్య ఎలిమినేషన్ మరీ షాకింగ్ ఇన్సిడెంట్ గా తీసుకోలేం. ఇక 10 వారాలు హౌస్లో ఉన్న బాల ఆదిత్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం బయటకొచ్చింది. 

బాల ఆదిత్య వారానికి రూ. 65 వేలు ఒప్పందంపై హౌస్లోకి వెళ్లారట. పది వారాలున్న బాల ఆదిత్య రూ. 6 .5 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట.  టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం బాల ఆదిత్యకు దక్కింది అంత. ఇక ఈవారం బాల ఆదిత్యతో పాటు వాసంతి ఎలిమినేటైన విషయం తెలిసిందే. ఆమెకు పెద్దగా ఫేమ్ లేదు. హౌస్ కి వెళ్లే వరకూ ఎవరికీ తెలియదు. దీంతో వాసంతి 10 వారాల రెమ్యూనరేషన్ మూడు నుండి మూడున్నర లక్షల లోపే అంటున్నారు. 

ఇక హౌస్లో పది మంది మిగిలారు. ఆదిరెడ్డి, రోహిత్, ఫైమా, రాజ్, కీర్తి, ఇనయా, రోహిత్, మెరీనా, శ్రీసత్య, శ్రీహాన్ టాప్ టెన్ కంటెస్టెంట్స్ అయ్యారు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ జరగనుంది. కెప్టెన్ ఫైమాను మినహాయించి మిగిలిన తొమ్మిది మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios