Bigg Boss telugu 6: ఫైనల్ కి ముందు ఊహించని షాక్... బిగ్ బాస్ హౌస్ నుండి శ్రీసత్య అవుట్!
ఈ సీజన్లో పెద్ద ఎత్తున నెగిటివిటీ మూటగట్టుకున్న కంటెస్టెంట్ శ్రీసత్య. ఇతరులపై ఆధారపడి నెట్టుకొచ్చిందన్న ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీసత్య ఫైనల్ గా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది.

మొదటి నుండి శ్రీసత్యపై ఎక్కడలేని నెగిటివిటీ నడుస్తుంది. ఆమెను బయటకు పంపేయండని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీసత్య ఆట తీరు నచ్చని ఆడియన్స్... బిగ్ బాస్ హౌస్లో ఉండే అర్హత ఆమెకు లేదంటారు. అర్జున్ కళ్యాణ్ ఉన్నంత కాలం తనని వెంట తిప్పుకుంది. అర్జున్ గేమ్ డిస్టర్బ్ చేసి ఎలిమినేషన్ కి కారణమైంది. నేను ఎవరికీ దగ్గర కానని అర్జున్ తో చెప్పిన శ్రీసత్య... అతడు ఎలిమినేట్ అయ్యాక, శ్రీహాన్ తో రొమాన్స్ స్టార్ట్ చేసింది.
ఇతర కంటెస్టెంట్స్ పట్ల వెటకారం, ఆమె ఫేక్ గేమ్ నచ్చవంటూ ఆడియన్స్ ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. కాగా బిగ్ బాస్ హౌస్లో రేవంత్, రోహిత్, ఆదిరెడ్డి, శ్రీను, కీర్తి, శ్రీసత్య ఉన్నారు. ఫైనల్ కి వెళ్ళేది మాత్రం ఐదుగురే. దీంతో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున వెల్లడించారు. బుధవారం వరకు వచ్చిన ఓట్లు పరిగణలోకి తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తామని చెప్పారు.
ఈ క్రమంలో శ్రీసత్య ఎలిమినేట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అందరికంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న శ్రీసత్యను బయటకు పంపుతున్నారట. దీంతో ఆమె యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నప్పుడు కూడా ఇంత సంతోషం కలగలేదు, అంటూ కామెంట్స్ పోస్ట్స్ చేస్తున్నారు. ఫైనల్ గా స్నేక్ ని బయటకు పంపేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో శ్రీసత్యపై ఈ స్థాయిలో నెగిటివిటీ ఉందా... అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఫ్యామిలీ వీక్ శ్రీసత్యకు కలిసొచ్చింది. వీల్ చైర్ లో ఆమె తల్లి రావడంతో సింపతీ సంపాదించింది. బిగ్ బాస్ షోతో వచ్చిన డబ్బులతో అమ్మకు ట్రీట్మెంట్ ఇప్పించాలంటూ మరింతగా జనాల మైండ్ ట్యూన్ చేసింది శ్రీసత్య. లేకుంటే ఆమె రెండు వారాల క్రితమే ఎలిమినేట్ కావాల్సింది.