మిషన్ పాజిబుల్ గేమ్ స్నేహితులైన ఆదిరెడ్డి, గీతూ మధ్య మంట పెట్టింది. మైండ్ గేమ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు ఆడుతున్న గీతూకి ప్రత్యర్థి టీమ్ లో ఉన్న ఆదిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తుంది. మిషన్ పాజిబుల్ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు బ్లూ అండ్ రెడ్ అనే రెండు టీమ్స్ గా విభజించారు. బ్లూ టీమ్ కెప్టెన్ గా ఆదిరెడ్డి ఉన్నాడు. రెడ్ టీం రేవంత్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ గేమ్ లో ఒక టీమ్ సభ్యులు మరొక టీమ్ సభ్యులను చంపాల్సి ఉంటుంది. భుజాలపై ఉన్న నాలుగు స్రిప్ట్స్ లాగేస్తే సభ్యుడు చనిపోయి ఘోస్ట్ అవుతాడు. ఈ గేమ్ బ్లూ , రెడ్ టీమ్ సభ్యుల మధ్య వాగ్వాదాలకు, తీవ్ర ఆరోపణలకు కారణమైంది.
మైండ్ గేమ్ పేరుతో బ్లూ టీమ్ సభ్యుల వస్తువులు దాచేస్తూ రెడ్ టీమ్ సభ్యులు వారిని విసిగించేస్తున్నారు. బాల ఆదిత్య సిగరెట్స్, ఇనయా తినే ప్లేట్, బట్టలు ఇలా వస్తువులు దొంగిలించి వాళ్ళ ఎమోషన్స్, వీక్నెస్ లపై కొడుతున్నారు. తాజాగా రెడ్ టీమ్ లో గీతూ గేమ్ దిగజారిపోయింది. బ్లూ టీమ్ సభ్యుడి టీ షర్ట్ దొంగిలించి అది శ్రీహాన్ కి వేసి అవి పీకేసింది. బాడీ మీద నుండే లాక్కున్నాం కాబట్టి మేము గేమ్ సరిగా ఆడినట్లే అని గీతూ సమర్ధించుకుంది.
ఇది బ్లూ టీం లీడర్ ఆదిరెడ్డికి తీవ్ర కోపానికి గురి చేసింది. తన టీ షర్ట్ తీసి విసిరేసి వెళ్లి కూర్చున్నాడు. గేమ్ లో నువ్వు బ్లేమ్ చేయబడింది కాక టెన్ మొత్తం బ్లేమ్ కి గురయ్యేలా చేస్తున్నావు అన్నాడు. దీనికి బదులు తీర్చుకుంటానన్న ఆదిరెడ్డి ఆ రోజు నేను కొట్టిన దెబ్బకు నీ కళ్ళ వెంట నీళ్లు కారతాయి అన్నాడు.
ఇక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో నాగార్జున చర్చించాల్సిన అనేక పాయింట్స్ నమోదయ్యాయి. ముఖ్యంగా రేవంత్, గీతూ వరస్ట్ గేమ్ ఆడారు. రేవంత్ బూతులు నా కొడకల్లారా నుండి నీ యమ్మా వరకూ వెళ్ళిపోయింది. ఫిజికల్ గా హర్ట్ చేయడానికి చూడడం, బూతులు తిట్టడం చేశాడు. నాగార్జున పోయిన వారం చెప్పినా రేవంత్ కి ఏమాత్రం ఎక్కలేదు. అతడు అదే దూకుడు, నోటి దురుసు చూపించాడు.
