MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Adivi Sesh : రెమ్యునరేషన్ భారీగా పెంచిన అడివి శేష్.. డెకాయిట్ సక్సెస్ కలిసోచ్చిందా?

Adivi Sesh : రెమ్యునరేషన్ భారీగా పెంచిన అడివి శేష్.. డెకాయిట్ సక్సెస్ కలిసోచ్చిందా?

డెకాయిట్ సక్సెస్ అవ్వడంతో నాలుగేళ్ల తరువాత మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అడివి శేష్. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వెళ్లున్న ఈ హీరో.. భారీగా రెమ్యునరేషన్ కూడా పెంచాడట. ఇంతకీ ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 14 2026, 07:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరో..
Image Credit : our own

ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరో..

గెలుపోటములతో సంబంధం లేకుండా.. డిఫరెంట్ స్టోరీస్ తో, ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోలు టాలీవుడ్‌లో కొంత మంది మాత్రమే ఉన్నారు. అందులో అడివి శేష్ ముందు వరసలో ఉంటాడు. కమర్షియల్ సినిమాలే అయినా.. కథాబలం ఉన్న , కంటెంట్ ఆధారిత సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన జర్నీని స్టార్ట్ చేసి.. తరువాత హీరోగా మారాడు అడివి శేష్. మంచి సినిమాలతో వరుస విజయాలను చూస్తున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వరుస విజయాలతో పెరిగిన మార్కెట్
Image Credit : Adivi Sesh fb

వరుస విజయాలతో పెరిగిన మార్కెట్

ఎక్కువెక్కువ సినిమాలు చేయకుండా.. గ్యాప్ తీసుకుని మంచి సినిమాలను మాత్రమే సెలక్ట్ చేసుకుంటున్నాడు శేష్. అంతే కాదు వరుస విజయాలతో తన మార్కెట్ ను కూడా పెంచుకుంటున్నాడు. ఈక్రమంలోనే ఆయన నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’, ‘హిట్-2’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఈ సినిమాల సక్సెస్ ప్రభావంతో అడివి శేష్ మూవీస్ కు ప్రస్తుతం థియేట్రికల్ , నాన్-థియేట్రికల్ బిజినెస్ కలిపి సుమారు రూ.70 కోట్ల వరకు జరుగుతున్నట్లు సమాచారం.

35
డెకాయిట్ సక్సెస్ తో మంచి ఫామ్ లోకి..
Image Credit : instagram

డెకాయిట్ సక్సెస్ తో మంచి ఫామ్ లోకి..

ఇంత భారీ బిజినెస్ జరుగుతుండటం.. డెకాయిట్ సక్సెస్ తో మంచిఫామ్ లో ఉంటం.. ఇదే మంచి టైమ్ గా భావించి.. తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచాడట శేష్. ఈ విషయంపై టాలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఆయన ఇకపై ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల నుండి రూ.25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అఫీషియల్ గా ఆయన వెల్లడించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది.

45
రెమ్యునరేషన్ భారీగా పెంచిన అడివి శేష్ ?
Image Credit : our own

రెమ్యునరేషన్ భారీగా పెంచిన అడివి శేష్ ?

ఇక సాయి మార్తాండ్‌ డైరెక్షన్ లో చేయబోయే లవ్ స్టోరీ ప్రాజెక్ట్ కోసం ఆయన రూ.25 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో, అడివి శేష్ భారీ ప్లానింగ్ తో  చేస్తున్న ‘గూఢచారి 2’ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లకు చేరినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో అడివి శేష్ సాధారణ రెమ్యూనరేషన్ తీసుకోవడం కాకుండా, లాభాల్లో వాటాను కూడా పొందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ‘గూఢచారి 2’ సినిమా భారీ విజయాన్ని సాధించి రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తే, నాన్-థియేట్రికల్ బిజినెస్‌తో కలిపి శేష్‌కు వాటాల రూపంలో సుమారు రూ.50 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

55
మల్టీ టాలెంట్ చూపిస్తోన్న హీరో..
Image Credit : our own

మల్టీ టాలెంట్ చూపిస్తోన్న హీరో..

అడివి శేష్ కేవలం నటుడిగానే కాకుండా, తన సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించడం ద్వారా నిర్మాణ వ్యయాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం పెద్ద విషయం కాదు. మొత్తానికి, తన కంటెంట్ సెలక్షన్, మల్టీ టాలెంట్ స్కిల్స్ తో ఇండస్ట్రీలో తన స్థాయితో పాటు రెమ్యునరేషన్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు అడివి శేష్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
రాజమౌళి ని డిస్సపాయింట్ చేసిన చిరంజీవి సినిమా, రామ్ చరణ్ తో పూర్తి చేసిన జక్కన్న..
Recommended image2
Balakrishna : పొద్దు పొద్దున్నే 3 గంటలకు.. బాలయ్య బ్యాడ్ హ్యాబిట్, ఎందుకు మానలేకపోతున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved