Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 5: ఫస్ట్ టైమ్‌ ఫిజికల్‌ టాస్క్ చేసిన షణ్ముఖ్‌.. మేం అడుక్కోవాలా అంటూ ప్రియాంకకి సిరి కౌంటర్‌

 మంగళవారం ఎపిసోడ్‌లో  కెప్లెన్‌ సన్నీ ఎమోషనల్‌గా కనిపించాడు. బిగ్‌బాస్‌ తమ ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ని సన్నీకి ఇచ్చాడు. వాళ్లమ్మ రాసిన లెటర్‌ని చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. లెటర్ చదువుతున్నంత సేపు అమ్మ గుర్తొచ్చిందన్నారు. ఫస్ట్ టైమ్‌ అమ్మ లెటర్‌రాసిందని చెప్పాడు సన్నీ. 

bigg boss telugu 5 51 episode shanmukh in first time siri counter to priyanka
Author
Hyderabad, First Published Oct 26, 2021, 11:49 PM IST

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5)లో 51వ రోజు ఎపిసోడ్‌ కాస్త ఎమోషన్స్, ఇంకాస్త ఫన్నీ, మరికాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగింది. మంగళవారం ఎపిసోడ్‌.. సోమవారం ఎపిసోడ్‌ నామినేషన్‌ ఎఫెక్ట్స్ తో స్టార్ట్ అయ్యింది. ఈ వారం రవి, లోబో, శ్రీరామ్‌, మానస్‌, షణ్ముఖ్‌, సిరి ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. మంగళవారం ఎపిసోడ్‌లో  కెప్లెన్‌ సన్నీ ఎమోషనల్‌గా కనిపించాడు. బిగ్‌బాస్‌ తమ ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ని సన్నీకి ఇచ్చాడు. వాళ్లమ్మ రాసిన లెటర్‌ని చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. లెటర్ చదువుతున్నంత సేపు అమ్మ గుర్తొచ్చిందన్నారు. ఫస్ట్ టైమ్‌ అమ్మ లెటర్‌రాసిందని చెప్పాడు సన్నీ. 

మరోవైపు షణ్ముఖ్‌(Shanmukh).. సిరి(Siri) వద్ద తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. విశ్వ లెటర్‌ కోసం చేసిన గేమ్‌ని ఎత్తి చూపుతూ.. విశ్వ సేఫ్‌గేమ్‌ ఆడుతున్నాడని తెలిపారు. అమ్మ ఫస్ట్ టైమ్‌ లెటర్‌ రాసిందని ఎమోషనల్‌ అయ్యాడు. వాళ్లమ్మ గతంలో ఎప్పుడూ లెటర్‌ రాయలేదని చెబుతూ, హౌజ్‌లో ఎవరి పర్‌ఫెర్మెన్స్ వాళ్లు చూపిస్తున్నారు సిరి ముందు వాపోయాడు. ఈ సందర్భంగా సిరికి గోరు ముద్దలు తినిపించాడు షణ్ముఖ్‌. ఈ సందర్బంగా సిరి సైతం కాస్త ఎమోషనల్‌గా కనిపించింది.

ఆ తర్వాత రవి, ప్రియాంక మధ్య `బావా` సన్నివేశాలు జరిగాయి. పెద్ద బావా ఏం చేస్తాడు, చిన్న బావా ఏం చేస్తాడంటూ రవి అంటుండగా, ప్రియాంక వారి గురించి చెబుతూ నవ్వులు పూయించింది. సరదాగా కాసేపు ఇలా ఫన్నీగా ఎంజాయ్‌ చేశారు. ఆ తర్వాత ప్రియాంక.. సిరితో మాట్లాడుతూ, బిగ్‌బాస్‌ తెలుగు 5లో మానస్‌, నేను టాప్‌ 5లో ఉంటామని అనింది. దానికి సిరి రియాక్ట్ అవుతూ, మరి మేం అడుక్కోవాలా? అంటూ తనదైన స్టయిల్‌లో కౌంటర్ ఇచ్చింది. దీనికి కొనసాగింపుగా మానస్‌ చెబుతూ, అంకుల్స్ అందరు బయటకు వెళ్లిపోవాలి, కుర్రాళ్లంతా ఉండాలన్నాడు. అయితే పింకా వెళ్లిపోతుందని సిరి చెప్పడం ఆసక్తికరంగా మారింది. 

దీంతోపాటు రవి, షణ్ముఖ్‌ల మధ్య ఉన్న గ్యాప్‌ని సరి చేసుకునే ప్రయత్నం చేశారు. `నాకు తెలిసి నేను చూసిన దాంట్లో వేరే ఈజ్‌ షన్ను అంటే ఇన్‌ మోజ్‌ రూమ్‌ విత్‌ త్రీ, ఆన్‌ బెడ్‌ విత్‌ త్రీ.. ` అని షణ్ముఖ్‌తో అన్నాడురవి. దీంతో రవిని హగ్‌ చేసుకుని తమ మధ్య ఉన్న విభేదాలకు పుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు గత వారం ప్రియా, సన్నీ, ప్రియాంకల మధ్య జరిగిన నామనేషన్ల ప్రక్రియని చేసి చూపించారు మానస్‌, సన్నీ. ఈ ఎపిసోడ్‌ నవ్వులు పూయించింది. 

ఆ తర్వాత ఇంటి సభ్యులంతా వచ్చే వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన `అభయహస్తం` అనే టాస్క్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో ఐదు దశల్లో ఇంటి సభ్యులు పోటీలో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఇందులో మొదటి స్టెప్‌లో పేడలో ముత్యాలు వెతకాల్సిఉంటుంది. ఇందులో లోబో,షణ్ముఖ్‌ గేమ్లో పార్జిసిపేట్‌ చేయగా, షణ్ముఖ్‌ గెలిచాడు. దీంతో కెప్టెన్సీ కంటెండర్‌గా అర్హత సాధించారు. అంతేకాదు లాక్‌ డౌన్‌ లో ఉన్న హౌజ్‌లోకి వెళ్లే అనుమతి లభిస్తుంది. అలా ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్‌గా షణ్ముఖ్‌ నిలిచి హౌజ్‌లోకి వెళ్లాడు. 

రెండు గేమ్‌లో నీటిలో సీసాలను తీయాల్సిఉంటుంది. ఇందులో యాంకర్‌ రవి, సిరి పోటీ పడ్డారు. ఇందులో సిరి విజయంసాధించింది.  రెండో కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచింది. మూడో టాస్క్ లో తాళ్లనిఊపాల్సి ఉంటుంది. ఇందులో శ్రీరామ్‌ విజయం సాధించాడు. ప్రస్తుతం షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌ కెప్టెన్సీ కోపం పోటీపడుతున్నారు. 

also read: మంచు మనోజ్‌ రెండో పెళ్లి.. నన్ను కూడా ఆహ్వానించండంటూ మంచు హీరో దిమ్మతిరిగే కౌంటర్‌
 

Follow Us:
Download App:
  • android
  • ios