Asianet News TeluguAsianet News Telugu

బాస్ బాస్ సీజన్ 5, గ్రాండ్ లాంఛ్... ఓ లైలా కోసం అంటూ వేదిక పైకి  హోస్ట్ నాగ్ ఎంట్రీ!

గత సీజన్స్ కి మించి మరింత ఫన్, ఎంటర్టైన్మెంట్ తో షో సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పాట ముగిసిన వెంటనే నాగార్జున బిగ్ బాస్ హౌస్ ని పరిచయం చేశారు. బిగ్ బాస్ హౌస్ డిజైన్ సరికొత్తగా ఉంది. 

bigg boss show grand launch this is how nagarjuna enters on stage
Author
Hyderabad, First Published Sep 5, 2021, 6:27 PM IST


ది వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5  ఘనంగా ప్రారంభమైంది. హోస్ట్ గా నాగార్జున తనదైన శైలిలో షో ప్రారంభించారు. ఇక అక్కినేని నాగేశ్వరరావ్ ఆల్ టైం హిట్ ఒక లైలా కోసం పాటతో వేదికపైకి వచ్చేశారు నాగార్జున. ఆయన ఎనర్జీతో షో మరింత రంజుగా ప్రారంభమైంది. 


గత సీజన్స్ కి మించి మరింత ఫన్, ఎంటర్టైన్మెంట్ తో షో సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పాట ముగిసిన వెంటనే నాగార్జున బిగ్ బాస్ హౌస్ ని పరిచయం చేశారు. బిగ్ బాస్ హౌస్ డిజైన్ సరికొత్తగా ఉంది. హౌస్ లో పవర్ హౌస్ అనేది ఒకటి ఉంది. 

అలాగే బెడ్ రూమ్ లో రెండు రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి. 
ఆ రూమ్స్ అలా ఎందుకు లాక్ చేసిన ఉన్నాయో నాగ్ బిగ్ బాస్ అని అడిగినా సమాధానం ఇవ్వలేదు. సమయం వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయని చెప్పారు. మొత్తంగా బిగ్ బాస్ షో ఇంట్రోడక్షన్ అదిరిపోయింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios